చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరుగుతుంది. ఆదివారం నుంచే ఈ షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఇల్లందులోని జేకే కోల్‌ మైన్స్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లపై కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్‌ నుంచి తాజాగా ఓ ఫోటో పంచుకున్నారు. సెట్‌లో షూటింగ్‌ జరుపుతుండగా తీసిన ఈ ఫోటోని చిత్ర బృందం పంచుకుంది. 

ప్రస్తుతం ఈ లుక్‌ గూస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తుంది. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌ పాల్గొనగా, కొరటాల ముందుండి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలో చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆర్మీ గెటప్‌లో కనిపిస్తున్నారు. కామ్రేడ్స్ గా నటించే వీరిద్దరు ఇందులో ఆర్మీ గెటప్‌లో కనిపించడం ఆశ్చర్యానికి, అనేక సందేహాలకు, సస్పెన్స్ క్రియేట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ `సిద్ద` అనే కామ్రేడ్‌గా, కీలక పాత్ర పోషిస్తున్నారు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్‌లో చెర్రీ పాల్గొన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కి జోడిగా పూజా హెగ్డే కనిపించనున్నారు.