మరో కొన్ని గంటలలో నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ నిహారిక పెళ్ళికి వేదిక కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడకు చేరిపోయారు. గత రాత్రి గ్రాండ్ గా ఉదయ్ పూర్ ప్యాలస్ లో సంగీత్ జరిగింది. కాబోయే జంట నిహారిక చైతన్య మెగాస్టార్ సాంగ్స్ కి స్టెప్స్ వేసి అలరించారు. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ పెళ్లి కోసం డిజైనర్ వేర్ లో దర్శనం ఇచ్చారు. నిహారిక పెళ్లి వేడుక వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో నిహారిక పెదనాన్న చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 
 
'మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే  దంపతులకు నా శుభాకాంక్షలు  , ఆశీస్సులు.  గాడ్ బ్లెస్ యూ' అంటూ కూతురి పట్ల తన ఆప్యాయత చాటుకున్నారు. మూడేళ్ళ చిన్నారి నిహారికను ఎత్తుకొని చిరంజీవి చిన్న స్మైల్ ఇచ్చారు. నిహారికకు పెళ్లి కానుకగా చిరంజీవి విలువైన వస్తువులు అందజేసినట్లు సమాచారం అందుతుంది. 
 
ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు మెగా హీరోలు, కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. పవన్ నేడు బయలుదేరినట్లు తెలుస్తుంది. మొత్తంగా నిహారిక-చైతన్య వివాహాన్ని మెగా కుటుంబం మొత్తం కలిసి గ్రాండ్ గా జరుపుతున్నారు. షూటింగ్స్ కి సైతం బ్రేక్ ఇచ్చి అందరూ వేడుకకు హాజరైపోయారు.