కర్నూలు ఎయిర్‌పోర్ట్ కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదటితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా స్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

కర్నూలు ఎయిర్‌పోర్ట్ కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదటితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా స్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. `కర్నూల్‌ ఎయిర్‌పోర్ట్ కి మొదటి భారత ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని పెట్టడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గొప్ప యోధుడికి, దేశభక్తి కలిగిన అన్‌సంగ్‌ హీరోకి దక్కిన గౌరవం. తెరపై అలాంటి యోధుడి పాత్రలో నటించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా` అని తెలిపారు. 

Scroll to load tweet…

కర్నూల్‌లోని ఓర్వకల్లులలో ఎయిర్‌పోర్ట్ ని గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ఎయిర్‌పోర్ట్ కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా ప్రకటించారు. ఈ విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ ఎంసీ, జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆయన ఈ సందర్బంగా ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో చిరంజీవి టైటిల్‌ రోల్‌పోషించిన విషయం తెలిసిందే. 2019లో ఇది విడుదలైంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషించారు.