తాప్సీపై షాకింగ్‌ కామెంట్లు చేశారు చిరంజీవి. ఆమె ఎదిగిన తీరుని ప్రశంసిస్తూనే ఆమెతో నటించే ఛాన్స్ మిస్సయ్యినందుకు చాలా బాధపడుతున్నట్టు వెల్లడించారు చిరు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) రాజకీయాలకు సంబంధించి పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఆయన తాప్సీ(Taapsee)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాప్సీని చూశాక తాను రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా? అనిపించిందట. ఆయన మాటలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, తాప్సీ ప్రధాన పాత్రలో స్వరూప్‌ దర్శకత్వం వహించిన `మిషన్‌ ఇంపాజిబుల్‌`(Mishan Impossible) చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. ఈవెంట్‌కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు. సినిమా చూశానని, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. 

ఇందులో తాప్సీపై షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఆమె ఎదిగిన తీరుని ప్రశంసిస్తూనే ఆమెతో నటించే ఛాన్స్ మిస్సయ్యినందుకు చాలా బాధపడుతున్నట్టు వెల్లడించారు. చిరంజీవి మాట్లాడుతూ, తాప్పీ నటించిన `ఝుమ్మందినాదం` చిత్ర ఈవెంట్‌కి వెళ్లాను. అక్కడ తాప్సీని చూసి ఎంతో క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపించింది. అలాంటిది `పింక్‌` చిత్రంలో పవర్‌ఫుల్‌ ప్యాక్‌తో ఎంతో బలమైన పాత్రలో పర్‌ఫెర్మెన్స్ చూస్తుంటే వాహ్‌ అనిపిచంఇంది. లవ్లీగా ఉన్న క్యూట్‌ బేబీలా ఉందనుకున్న ఈ అమ్మాయేనా అనిపించింది. అలా అద్భుతమైన నటి ట్రాన్స్ ఫామ్‌ అయ్యింది. బాలీవుడ్‌లో తన మార్క్ ని చాటుకుంటుంది. అద్భుతమైన సినిమాలు చేస్తుంది. ఆమె ఈ సినిమాలో ఉందన్నప్పుడు `మిషన్‌ ఇంపాజిబుల్‌`పై ఆకర్షణ కలిగింది` అని తెలిపారు. 

ఇంకా చెబుతూ, `ఝుమ్మంది నాదం` సినిమా చూసినప్పుడు తాప్సీ చాలా బాగుంది, వాహ్‌ అనిపించింది. కానీ అప్పట్లో నేను రాజకీయాల్లోకి వెళ్లిపోయాను. తనతో నటించే అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాను. ఇలాంటి వారిని చూసిన్నప్పుడు ఎందుకు పాలిటిక్స్ వెళ్లాననిపిస్తుంది. చాలా అసంతృప్తిగా ఫీలవుతుంటాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆమెతో కలిసి నటించాలని` అని చెప్పారు చిరు. అంతేకాదు నెక్ట్స్ ఆమెతో కలిసి నటించేలా ఓ ప్రాజెక్ట్స్ సెట్‌ చేయమని నిర్మాత నిరంజన్‌రెడ్డిని రిక్వెస్ట్ చేశారు చిరు. స్టేజ్‌పైనే ఉన్న దర్శకుల్లో ఎవరైనా ఓకే అని, లాటరీ తీసి సెలక్ట్ చేద్దామని చిరంజీవి చెప్పడం నవ్వులు పూయించింది. ఆద్యంతం చిరంజీవి తన ప్రసంగంతో హుషారు తెప్పించారు. 

YouTube video player

మరోవైపు నిర్మాతలపై హాట్‌ కామెంట్‌ చేశారు చిరు. ఒకప్పుడు నిర్మాతలు సినిమా కథల్లోనూ భాగమయ్యే వారని, చర్చల్లో పాల్గొనేవారని, సినిమా జరుతున్న సమయంలోనూ వారు ఇన్‌వాల్వ్ అయ్యేవారని, సినిమా ఎలా వస్తుందో చూసుకునే వారని తెలిపారు. కానీ రాను రాను నిర్మాత అనేవాడు ఫైనాన్షియర్‌గానే మారిపోయారు. సినిమా కథల్లో అతని భాగస్వామ్యం తగ్గిపోయిందని, దీంతో ఎలాంటి సినిమా తీస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కానీ ఇప్పుడు నిరంజన్‌రెడ్డి లాంటి నిర్మాతలు కథలో ఇన్‌వాల్వ్ అయి సినిమాలు చేయడం అభినందనీయమన్నారు. `ఆచార్య` సినిమా విషయంలోనూ ఆయన ఇన్ వాల్వ్ అయ్యారని చెప్పారు చిరు. 

ప్రస్తుతం చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రానికి రామ్‌చరణ్‌తోపాటు నిరంజన్‌రెడ్డి నిర్మాత. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటించగా, కీలక పాత్రలో రామ్‌చరణ్‌, ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదల కాబోతుంది. మరోవైపు `గాడ్‌ ఫాదర్‌`, `భోళా శంకర్‌`, `మెగా 154` చిత్రాల్లు చేస్తున్నారు చిరంజీవి.