మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.  అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించింది. అందులో భాగంగా రీసెంట్ గా  సినిమా మేకింగ్‌ వీడియో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయటానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు టీజర్ రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ ఓ  పోస్టర్ ని వదిలింది టీమ్. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

ప్రమోష‌న్ పోస్టర్ ఆద్యంతం దేశ భ‌క్తిని ర‌గిల్చేలా క‌నిపిస్తోంది. ఇక టీజ‌ర్ ఊహ‌కే అంద‌ని విధంగా ఉంటుంద‌ని, సినిమా ఏంటనేది దాంతో అర్దమవుతుంది యూనిట్ స‌భ్యులు నమ్మకంగా ఉన్నారు.  ఇప్పటికే తొలి టీజ‌ర్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. 

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న  ‘సైరా’ రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది. క్వాలిటీ కోసం సురేందర్ రెడ్డి  సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. చివరికి చిరు మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి. ఈయన తెరకెక్కించిన సీన్స్ చిరుకు తెగ నచ్చేసాయని సమాచారం. మేకింగ్ వీడియో, టీజర్ పోస్టర్ ఇలా ఉందంటే  సినిమా ఎలా ఉండబోతోందో అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 

రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.