ఈ రోజున చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి తెలియనివాళ్లు లేరు. చిరంజీవి చేసిన సేవా కార్యాక్రమంలో అత్యంత గుర్తింపు తెచ్చిపెట్టన అంశం ఇది. మదర్ థెరిస్సా స్పూర్తిగా ఈ బ్యాంక్ ని ప్రారంభించి సేవ చేస్తున్న ఆయన్ని చాలా మంది మెచ్చుకుంటూంటారు. అయితే అసలు ఈ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది. అందుకు కారణం ఏమిటనేది ఆయన స్వయంగా తెలియచేసారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ‘సైరా’ను అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బి పాజిటివ్‌’ మ్యాగజైన్‌ కోసం ఆయన కోడలు...రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన చిరంజీవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. 

చిరంజీవి మాట్లాడుతూ.... 23ఏళ్ల కిందట ఒక రోజు నేను పేపర్‌ చదువుతుంటే, రక్తం లేక చాలా మంది చనిపోతున్నారన్న వార్త కనిపించింది. ఇంతమంది జనం ఉండి కూడా రక్తం ఇచ్చేందుకు ఎవరూ రావడం లేదనిపించింది. అందుకే ఎంతోమంది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నేను ‘బ్లడ్‌బ్యాంక్‌’ ప్రారంభించాలని అనుకున్నా. ఆ మరుసటి రోజు నుంచే ఆ దిశగా ప్రయత్నాలు చేశా. 

నా అభిమానులను ఆ దిశగా నడిపా. చాలా మందిలో చైతన్యం వచ్చింది. గత పదేళ్లలో రక్తం అందక చనిపోయిన ఖాతాలు దాదాపు లేవు. దీనికి సంబంధించి ఎవరి దగ్గరి నుంచీ నేను విరాళాలు సేకరించలేదు. నా సొంత డబ్బులతోనే వీటిని నిర్వహిస్తున్నా. ఇప్పటివరకూ నేను సాధించినదంతా నా అభిమానులకే చెందుతుంది. వాళ్లు ముందుకు రాకపోతే, అది కార్యరూపం దాల్చేది కాదు. ఫ్యాన్స్‌ అన్నపదానికి సరికొత్త అర్థం చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు.