చిన్న తనం నుంచి కలిసి పెరిగి.. కలిసి చదువుకున్న రామ్ చరణ్, రానాల గురించి ఓ సీక్రేట్ విషయం బయట పెట్టారు మెగాస్టార్ చిరంజీవి ఇంతకీ ఆయన ఏ చెప్పారంటే..?  

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక వరుసగా భారీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. అటు బాహుబలి సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అయ్యి.. తెలుగులో పాటు.. హిందీలో కూడా ఫ్యాన బేస్ ను ఏర్పరుచుకున్నాడు రానా దగ్గుబాటి. అయితే రానా, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా మందికి తెలియదు. అంతే కాదు వీరిద్దరు కలిసి చెన్నైలో చదువుకున్నారని. కలిసి పెరిగారన్న సంగతి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ ఇద్దరు కలిస్తే మాత్రం విషయం వేరే లెవల్లో ఉంటుందట. 

హీరోగా సెటిల్ అయిన ఈ ఇద్దరు స్టార్లు కలిసి చదువుకోవడమే కాదు.. కలిసి అల్లరి కూడా బాగా చేసేవారట. వీరి బ్యాచ్ లో శర్వానంద్ కూడా ఉన్నాడు కాని.. ముఖ్యంగా రానా, రామ్ చరణ్ మాత్రం చాలా స్పెషల్. అయితే వీరి స్నేహం గురించి వీరు చేసే పనుల గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించారు. అందరు తెలుసుకుని.. ఔరా అనే విధంగాసీక్రేట్స్ విప్పారుమెగాస్టార్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

అయితే వీళ్లిద్దరూ కలిసి చిన్నప్పుడూ చాలా అల్లరి చేసేవారట. ఈ విషయాన్ని చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలంటే చాలా కేర్ లెస్ గా.. జల్సాలు చేసుకుంటూ ఉంటారని అంతా అనుకుంటారు. వీళ్ళు మాత్రం రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని మరీ చదువుకునేవారట. అయితే అది కాసేపే.. అలా కాసేపు చదువుకున్నట్టు యాక్టింగ్ చేసి ఆ తర్వాత కిటికీల కు ఉండే గ్రిల్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్లి బయట చాలా సేపు తిరిగి మళ్లీ ఏమీ తెలియనట్లు ఇంట్లో కి వచ్చి గ్రిల్స్ మళ్లీ పెట్టేసి ఎప్పటి లాగే చదువుకుంటూ యాక్టింగ్ చేసేవారుట.

మెగాస్టార్ ఈ సీక్రేట్ ను కనిపెట్టినా.. తెలియనట్టే ఉండేవారట. తాజాగా ఈ విషయాన్ని సరదాగా వెల్లడించారు చిరంజీవి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో.. గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో తన 16వ సినిమా చేయబోతున్నాడు. త్వరలో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.