Asianet News TeluguAsianet News Telugu

చిత్ర పరిశ్రమ కోసం చిరు రిక్వెస్ట్.. 24క్రాఫ్ట్ లకు యాభై శాతం ఫీజుతోనే.. బండ్ల గణేష్‌ ట్వీట్‌ వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి రిక్వెస్ట్ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన 24 క్రాఫ్ట్స్ ల వారికి 50శాతంతో మెడికల్‌ టెస్ట్ లు చేస్తామని తెలిపారు యోధా లైఫ్‌ లైన్‌ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్‌. దీనిపై తాజాగా బండ్ల గణేష్‌ స్పందించారు. 

chiranjeevi request to yodha life line diagnostics bandla ganesh tweet viral
Author
Hyderabad, First Published Nov 18, 2021, 7:50 PM IST

మెగాస్టార్(Chiranjeevi)‌.. తన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్(Chiranjeevi Charitable Trust) ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌లను నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ ఫ్లాంట్‌లు ఏర్పాటు చేసి, అలాగే ఆక్సిజన్‌ సిలిండర్లని అందించి ఎంతో మంచి ప్రాణాలు కాపాడారు. అదే సమయంలో కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో `సీసీసీ`(కరోనా క్రైసిస్‌ చారిటీ`) పేరుతో నిత్యావసర సరుకులు అందించడంలో కీలక భూమిక పోషించారు. 

బుధవారం నాడు  భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంక‌య్య నాయుడు చేతుల మీదుగా యోధా లైఫ్ డ‌యాగ్న‌స్టిక్స్ అధినేత సుధాక‌ర్ రూ.25 లక్షల విరాళం ట్ర‌స్ట్ సేవ‌ల కోసం అందించారు. ఈ డయాగ్నస్టిక్స్ ఓపెనింగ్‌ కార్యక్రమంలో చిరంజీవి ఓ అతిథిగా పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన ఇందులో తమ చిత్ర పరిశ్రమకి చెందిన 24 క్రాఫ్ట్ ల వారికి ఏదైనా సహాయం చేయాలని కోరారు చిరు. దీంతో స్పందించిన యోధా లైఫ్‌ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్‌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సభ్యులతో సహా, 24క్రాఫ్ట్ ల వారికి 50శాతం ఫీజులతోనే వైద్య పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. Chiranjeevi మాట్లాడుతూ, `ఇది ఊహించ‌లేదు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా నా సొంత రిసోర్సెస్ తోనే ట్ర‌స్ట్ ని న‌డిపాను. ఈ మ‌ధ్య కాలంలో కొంతమంది   పెద్ద‌లు ముందుకు వచ్చి చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ సేవ‌ల్ని గుర్తించి  సముచిత ఆర్థిక సాయాన్ని అందివ్వడం ఆనంద దాయకం  మీరు ఇచ్చిన  ప్ర‌తి ఒక్క పైసా అవసరార్ధులకు అందేలా చేస్తా, ఇది మీకు నా హామీ. ఇదే స‌మ‌యంలో నా వ్య‌క్తిగ‌త‌ అభ్య‌ర్థ‌న‌. మా సినీప‌రిశ్ర‌మ‌లో చాలా మంది MAA లోని  పేద క‌ళాకారులు, జూనియర్ కళాకారులు 24 క్రాఫ్ట్ లోని చిన్న టెక్నీషియన్స్  ఉన్నారు. వారంతా స‌రైన వైద్యం అంద‌క‌ ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. మీ డ‌యాగ్న‌సిస్ సెంట‌ర్  ద్వారా రోగ నిర్ధారణ పరిష్కారానికి గాను వారికి సాయం చేస్తార‌ని ఆశిస్తున్నాను` అని అన్నారు. 

దానికి ప్ర‌తిస్పంద‌న‌గా మూవీ ఆర్టిస్టుల సంఘంతో   స‌హా 24 శాఖ‌ల కార్మికుల‌కు 50 శాతం త‌క్కువ ఖ‌ర్చులోనే ఆరోగ్య‌ సేవ‌లందిస్తామ‌ని  యోధ లైఫ్ లైన్ సుధాక‌ర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ ట్విట్ట‌ర్ లోనూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇలాంటివి స‌మాజానికి మంచి సంజ్ఞ‌ల్ని ఇస్తాయి. ఎక్కువ మందికి సేవ చేయడం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో మాకు సహాయపడతాయి. హైదరాబాద్ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యోధ లైఫ్ లైన్ డ‌యాగ్న‌స్టిక్స్ వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల గారికి హృదయపూర్వక అభినందనలు` అని చిరు తెలిపారు. 

also read: చిరంజీవి చిత్ర పరిశ్రమకు మూడో కన్ను- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

చిరంజీవి చేసిన ఈ పనికి నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌(Bandla Ganesh) స్పందించారు. నిన్న బుధవారం యోధా లైఫ్‌ డయగ్నస్టిక్స్ ఓపెనింగ్ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతున్న వీడియోని బండ్ల గణేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. `మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా.. నోట మాట రావడం లేదు` అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం Bandla Ganesh ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios