చిరంజీవి ప్రతి ఏడాది రక్షాబంధన్‌ని ఘనంగా జరుపుకుంటారు. తమ ఇద్దరు చెల్లెళ్లు ఆయనకు రాఖీ కడతారు. మెగా కుటుంబం మొత్తం చిరు ఇంటికి చేరుతుంది. దీంతో ఆ రోజుంతా సందడి నెలకొంటుంది. అయితే చిరంజీవి ఈ సారి వైరస్‌ ప్రభావంతో చాలా నిరాడంబరంగా రాఖీ వేడుకను పూర్తి చేశారు. అయితే పెద్దగా సందడి కనిపించకపోయినా దాన్ని కాస్త వెరైటీగా మలిచాడు. క్రియేటివిటీని జోడించి అభిమానులకు విశెష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియోని ట్విట్టర్‌లో పంచుకున్నారు. 

ఇందులో ఇద్దరు చెల్లెళ్ళు ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికి ఓ చిన్నపాటి గిఫ్ట్ అని ఇచ్చి దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. `నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్..` అని ఆ వీడియోలో తెలిపారు. ఈ ట్వీట్‌కు విశేష స్పందన లభిస్తుంది. సోషల్‌ మీడియాలో చిరు రాఖీ వీడియో వైరల్‌ అవుతుంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ విశెష్‌ చెబుతున్నారు. 

అలాగే ఇటీవల పెళ్ళి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన యంగ్‌ హీరో నితిన్‌ కూడా తన సోదరి నిక్షిత రాఖీ కట్టిన ఫోటోను ట్విటర్‌లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు తన కూతురు సితార, తన అన్నయ్య గౌతమ్‌కి రాఖీ కట్టింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకున్నారు. 'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని పేర్కొన్నారు. 

మరోవైపు తారలు తమ రాఖీ శుభాకాంక్షలు చెబుతూ, కొత్త ఫోటోలను పంచుకుంటున్నారు. మరికొందరు హీరోలు తమ సినిమాల్లోని కొత్త లుక్ లను విడుదల చేసి రక్షాబంధన్‌ విశెష్‌ తెలిపారు.