చిరంజీవి సోషల్‌ మీడియాలోకి ఎంటరైనప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తరచూ తనకి సంబంధించిన కొత్త విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగా మెగాస్టార్‌ కుక్కర్‌గా మారిపోతున్నారు. సరదాగా కుక్కింగ్‌ చేస్తూ తన ఫ్యామిలీతోపాటు అభిమానులను అలరిస్తున్నారు. లాక్‌ డౌన్‌ టైమ్‌లో దోశ వేసి అమ్మకి తినిపించాడు. ఆ తర్వాత మధ్యలో వాళ్ళమ్మ కోసం స్పెషల్‌గా ఫిష్‌, చింతకాయ ఫ్రై చేసి వాళ్ళమ్మ అంజనీదేవితో వాహ్‌ అనిపించాడు. 

తాజాగా తన మనవరాళ్ల కోసం మరో స్పెషల్‌ రెడీ చేశారు. ఈ ఆదివారం మనవరాళ్ళు సంహిత, నివ్రితిల కోసం కె.ఎఫ్‌.సి చికెన్‌ రెడీ చేశారు. ఆదివారం ఉదయం తన మనవరాళ్లతో కలిసి కె.ఎఫ్‌.సి చికెన్‌ చేస్తున్నట్టు ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు చిరు. `రేపటి తరం అభిరుచికి నచ్చేటట్లు, రుచిగా ఏమన్నా చేయగలిగితే ఆ కిక్కే వేరప్పా` అంటూ ఈ వీడియో షేర్‌ చేశారు. 

ఇందులో నివ్రితి, సంహితలు బోర్‌ కొడుతుందని, కెఎఫ్‌సి చికెన్‌ తినాలని ఉందని సంహిత అనగా.. బయట పరిస్థితులేమీ బాగోలేదు.. ఇంట్లోనే రెడీ చేసుకుందామని చిరు అన్నారు. ఇంట్లో.. కె.ఎఫ్‌.సి చికెన్‌ ఎవరు రెడీ చేస్తారనగానే చిరు నేను చేస్తా అన్నాడు. అనడమే ఆలస్యం.  మీరు నాకు అసిస్టెంట్స్‌గా సహాయం చేస్తే.. అనగా.. ఇద్దరు మనవరాళ్లు.. నవ్వుకుంటూ.. కెఎఫ్‌సి చికెన్‌ తయారీకి కావాల్సిన వన్నీ రెడీ చేసి.. చిరుతో చేయించారు. ఫైనల్‌గా అద్భుతంగా ఉందంటూ.. మనవరాళ్లు కెఎఫ్‌సి చికెన్‌ను తిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.