వచ్చే నెలలో అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతుంది. దీనికి సినిమా ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయట. అయితే తెలుగులో ఇద్దరికే ఇన్విటేషన్ వచ్చిందట.
అయోధ్యలో రామమందిరం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. శరవేగంగా టెంపుల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఈ దేవాలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ట చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. కనీవిని ఎరుగని రీతిలో ఈ వేడుక జరుగనుందని తెలుస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా తమ నినాదం కూడా రాముడే కావడంతో మరింత కేర్ తీసుకుంటున్నారు. తమ సెంటిమెంట్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ అయోధ్య రామమందిరాన్ని ఆయుధంలా వాడుకోబోతుంది.
ఈ నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవానికి అనేక మంది ప్రముఖులను ఆహ్వానించినట్టు తెలుస్తుంది. దాదాపు దేశ వ్యాప్తంగా 2వేల మందికి దేవాలయ నిర్వాహక కమిటీ ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. అందులో సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక తెలుగు నుంచి కేవలం ఇద్దరికే ఈ ఆహ్వానం వచ్చినట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్‌లకు మాత్రమే ఈ ఇన్విటేషన్ అందిందని తెలుస్తుంది. చిరంజీవి బీజేపీ నాయకులకు దగ్గరగా ఉంటున్నారు. ఇప్పటికే వారిని కలిశారు. పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యామిలీ మొదట్నుంచి బీజేపీ పార్టీలోనే ఉంది. పైగా `ఆదిపురుష్` లాంటి సినిమాని చేశాడు ప్రభాస్. బీజీపీతో ఉన్న జనసేన అధినేత పవన్ కి కూడా ఈ ఆహ్వానం అంది ఉండొచ్చు. దీనిపై క్
అయితే ఎన్టీఆర్, నితిన్, నిఖిల్‌తోనూ బీజీపే నాయకులు సన్నిహితంగా ఉన్నారు. మరి వారికి ఆహ్వానం ఉందా? లేదా, టాలీవుడ్‌లో ఇతర హీరోలకు ఆహ్వానం లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తమిళం నుంచి సూపర్ స్టార్ రజనీ, ధనుష్‌లకు ఆహ్వానం అందిందని సమాచారం. అలాగే కన్నడ నుంచి `కేజీఎఫ్` స్టార్ యష్, `కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టిలకు ఆహ్వానం అందిందట. మరోవైపు మలయాళం నంచి మోహన్‌లాల్‌కి మాత్రమే ఇన్విటేషన్ వచ్చిందని తెలుస్తుంది.
ఇక ప్రధానంగా బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులకు ఈ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణ్ బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగన్‌లకు ఆహ్వానాలు అందాయని సమాచారం. వీరితోపాటు మాధురీ దీక్షిత్, అనుపమ ఖేర్, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి వంటి వారికి కూడా ఈ ఆహ్వానం అందిందని టాక్.
