సినీ కార్మికులది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలా సహకరమందిస్తున్నామని చెప్పారు
సినీ కార్మికులది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలా సహకరమందిస్తున్నామని చెప్పారు. నేడు మే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, సినీ పరిశ్రమ నుంచి చిరంజీవితో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలుగు చిత్రపరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారని అన్నారు. సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని చెప్పారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి పెద్ద ఆస్పత్రి కట్టించాలని ఆలోచనలో ఉన్నట్టు తనకు తెలిసిందని చెప్పారు. చిత్రపురిలో పాఠశాలలు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉందని వెల్లడించారు.
చిత్రపూరి కాలనీలో చిరంజీవి ఆస్పత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగం ఉంటుందని మంత్రి తలసాని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం, మతం లేదని చెప్పారు. సినీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు ఇస్తామని ప్రకటించారు.
