మెగా156తో టాలీవుడ్ లోకి మళ్లీ ఆ సంస్కృతి.. సినిమా ప్రారంభంపై ఎంఎం కీరవాణి

మెగాస్టార్ అభిమానులకు, సినీ ప్రియులకు మెగా156 ద్వారా గుడ్ న్యూస్ అందింది. ఈ సినిమా ప్రారంభంతో టాలీవుడ్ లోకి గత సంస్కృతిని తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూనిట్ విడుదల చేయడం వైరల్ గా మారింది.
 

Chiranjeevi Mega 156 movie beginning with a celebratory song composition NSK

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తున్నారు. చివరిగా ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. యంగ్ హీరోలకు పోటీగా చిరు సినిమాలు చేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు గతంలో సైన్ చేసిన సినిమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మెగా156లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండటం విశేషంగా మారింది. ఇప్పటికే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇక దసరా సందర్భంగా సినిమాను గ్రాండ్ పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభాన్ని గతంలో సినిమా ప్రారంభాల సంస్కృతిని, అప్పటి ఆనవాయితీల ప్రకారమే జరిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూనిట్ విడుదల చేసింది. వీడియో ద్వారా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. గతంలో ఏ సినిమానైనా ఎక్కువశాతం మంచి సాంగ్ కంపోజింగ్ తో ప్రారంభించే వారు. Mega156ను సెలబ్రేటింగ్ సాంగ్ కంపోజింగ్ తో ప్రారంభించినట్టు తెలిపారు. చిరంజీవి అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పారు. 

అదే ఆనవాయితీని పునఃరుద్ధరిస్తూ మెగా156ను మంచి సాంగ్ రికార్డింగ్ తో ప్రారంభించామన్నారు. ఈ చిత్రంలో భాగస్వామ్యం అయ్యినందుకు సంతోషంగా ఉందని, దర్శకుడు వశిష్టకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు మంచి సాహిత్యాన్ని అందిస్తామని స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ హామీనిచ్చారు. మొత్తానికి తెలుగు సినిమాకు గత కల్చర్ ను ఈ సినిమాతో తీసుకురావడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని కూడా కీరవాణి తెలిపారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 14వ సినిమాగా మెగా156 రూపుదిద్దుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూపించబోతున్నారు. దసరా సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.  త్వరలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అందించనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios