`ఫాదర్స్ డే` సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వంటి సెలబ్రిటీలు విషెస్‌ తెలిపారు. ఫాదర్స్ తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.

`గర్వించదగ్గ తండ్రికి.. కృతజ్ఞతగల కొడుకుగా ఉండటం గొప్ప అనుభూతి` అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). నేడు(జూన్‌ 19) ఫాదర్స్ డే (Fathersday)అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వరకు తమ తండ్రిని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తొలి హీరో నాన్న. కానీ గుర్తుంపుకి నోచుకోని తండ్రికి ఫాదర్స్ డే సందర్భంగా ఆయనకంటూ ఓ స్పెషల్‌ రోజు ఉండటంతో ఇప్పుడు తండ్రి గురించి చర్చ ఊపందుకుంటుంది. ఆయన చేసిన త్యాగాలు, మన కోసం ఆయన పడే కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

నేటి ఫాదర్స్ డే(Fathersday 2022) సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ తండ్రులకు విషెస్‌ తెలియజేస్తున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని, వారితో ఉన్న గుర్తులను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకట్‌ రావుతో దిగిన పాత ఫోటోని పంచుకున్నారు. ఆయనకు కొడుకుగా ఉండటం గొప్ప అనుభూతినిస్తుందని తెలిపారు చిరంజీవి. తండ్రి కానిస్టేబుల్‌ అనే విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

మరోవైపు సూపర్‌స్టార్‌ మహేష్‌(Maheshbabu) సైతం తన నాన్న, సూపర్‌స్టార్‌ కృష్ణ(Krishna)తో దిగిన ఫోటోని షేర్‌ చేశారు. నాన్నగురించి ఎమోషనల్‌ వర్డ్స్ పోస్ట్ చేశారు. ఇందులో `తండ్రి అంటే ఏంటో నాకు చూపించారు. తండ్రిగా ఎలా ఉండాలనే నేర్పించారు. తండ్రికి ఉదాహరణగా నన్ను నడిపించారు. మీరు లేకుండా నేను ఉండేవాడిని కాదు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా` అని పేర్కొన్నారు మహేష్‌. తను పంచుకున్న ఫోటోలు మహేష్‌, కృష్ణ ఓ ఫంక్షన్‌లో ఏదో చర్చిస్తుండటం ఆకట్టుకుంది. 

Scroll to load tweet…

దర్శకుడు మెహర్‌ రమేష్‌(Meher Ramesh) సైతం తన తండ్రి ఫోటోలను పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. తండ్రి భావజాలం, నీతి, నైతికత మమ్మల్ని ఎలా ఉండాలో నేర్పించాయి. నాన్నని మిస్‌ అయి చాలా ఏళ్లు అవుతుంది. కానీ ఆయన ప్రేమ, దయ నాకు జీవితంలో ఎలా ఉండాలో, శ్రద్ధగల తండ్రిగా ఎలా నడిపించాలో నేర్పించాయి` అని పేర్కొన్నారు. వీరితోపాటు మరికొందరు సెలబ్రిటీలు తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ, వారిని గుర్తు చేసుకుంటూ విషెస్‌ తెలియజేశారు.

Scroll to load tweet…