మోహన్‌లాల్‌ శుక్రవారం తన 61వ బర్త్ డే జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా అనేక మంది సినీ ప్రముఖులు బర్త్డ్‌ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. వారిలో చిరంజీవి, మహేష్‌, చెర్రీలు కూడా ఉన్నారు.

సౌత్‌ సూపర్‌ స్టార్‌, లలేట్టన్‌ మోహన్‌లాల్‌ కంప్లీట్‌ యాక్టర్‌గా సౌత్‌ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పాత్ర ఏదైనా, కథ మరేదైనా దానిలో పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యం. అందుకే ఆయన్ని పరి పూర్ణ నటుడిగా కీర్తిస్తుంటారు. మలయాళంలోనే కాదు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారు. అక్కడ కూడా తన అభిమాన గణాన్ని పెంచుకున్నారు. మంచి కథ పడితే, మంచి పాత్ర ఛాన్స్ వస్తే పాత్ర నిడివి, భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారాయన. నాలుగు దశాబ్దాలకుపైగా సినీ జీవితంలో దాదాపు 350కిపైగా సినిమాల్లో నటించి మెప్పించిన మోహన్‌లాల్‌ పుట్టిన రోజు నేడు(మే 21).

మోహన్‌లాల్‌ శుక్రవారం తన 61వ బర్త్ డే జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా అనేక మంది సినీ ప్రముఖులు బర్త్డ్‌ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. వారిలో చిరంజీవి, మహేష్‌, చెర్రీలు కూడా ఉన్నారు. చిరంజీవి చెబుతూ, `పుట్టిన రోజు శుభాకాంక్షలు లలేటన్‌. సినిమాటిక్‌ టాలెంట్‌ కి మీరు పవర్‌హౌజ్‌లాంటివారు. మనుషులో ఒక రత్నంలాంటివారు. ప్రేమగల నా సోదరుడు. మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌, మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోని పంచుకున్నారు. 

Scroll to load tweet…

మహేష్‌ ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు. మంచి ఆరోగ్యం, సంతోషం, సంతృప్తి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ ద్వారా చెబుతూ, ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు. తనకిది అద్భుతమైన మెమరీ అని చెప్పారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇదిలా ఉంటే నటుడిగా, నిర్మాతగా,ప్లే బ్యాక్‌ సింగర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న మోహన్‌లాల్‌ ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నారు. `బ్యారోజ్‌` పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక మోహన్‌లాల్‌ తెలుగులో `ఘాండీవం`చిత్రంలో గెస్ట్ రోల్‌ చేశారు. ఇటీవల `మనమంతా`, `జనతా గ్యారేజ్‌`లో నటించి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు.