#Chiranjeevi:పీపుల్స్ మీడియాలో చిరు సినిమా,డిటేల్స్
ఇప్పుడీ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించి, ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

మెగాస్టార్ చిరంజీవి వయస్సుకు సంభందం లేకుండా దూసుకుపోతున్నారు. ఎక్కడా స్పీడ్ తగ్గించే పరిస్థితి లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు తన కొత్త సినిమా విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఏ చిత్రం చేయబోతున్నారనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఆయన దర్శక,రచయిత బి.వియస్ రవి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దర్శకుడు మాత్రం రవి కాదు...పవన్ తో సినిమా చేస్తున్న ఓ దర్శకుడు అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత ఆయన కుమార్తె సుస్మిత వ్యవహించనుంది.
ఆ మధ్య సుష్మిత నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌తో పాటు సంతోష్ శోభన్ హీరోగా రెండు సినిమాలను కూడా నిర్మించింది. పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన సేనాపతి బాగా వర్కవుట్ అయినా, మిగిలిన ఆ రెండూ కూడా డిజాస్టర్‌గా మిగిలాయి. నిర్మాతగా అడుగుపెట్టిన సుష్మితకు ఆదిలోనే అపజయాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తన కుమార్తె సుష్మిత కొణిదెల కెరీర్‌ని కూడా గాడిలో పెట్టేందుకు సిద్దమయ్యారు చిరంజీవి. ఎలాగైన తన కూతురిని నిర్మాతగా నిలబెట్టాలని భావిస్తున్నారట చిరంజీవి. అందుకే తన తదుపరి సినిమాను కూతురి నిర్మాణ సంస్థలోనే చేయనున్నారట. ఈ ప్రాజెక్టుని ఆమే నిర్మించనున్నారు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఈ ప్రాజెక్టులో కో ప్రొడ్యూసర్ గా చేయనున్నారు. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. కేవలం మీడియా స్పెక్యులేషన్స్ మాత్రమే.
ఇప్పటికే ‘సైరా’తో తన కొడుకు రామ్ చరణ్‌ని నిర్మాతగా పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు కూతురికి కూడా తన సినిమాతో ఓ సూపర్ హిట్ అందించి,పెద్ద ప్రొడ్యూసర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడట.మొదట కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు చేద్దామనుకున్నారు. ఆ సినిమాకు సుష్మితనే నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో ఇప్పుడీ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించి, ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరో ప్రక్క వశిష్ట డైరెక్షన్‌లో చేస్తున్న పాన్ ఇండియా సినిమా విశ్వంభర షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది.