లెజెండ్రీ నటుడు ఎస్వీ రంగారావు శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ రంగారావు జీవితంలో ముఖ్య ఘట్టాలతో 'మహా నటుడు' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరు ఎస్వీరంగారావు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే తాను నటుడిగా మారానని చిరంజీవి తెలిపారు. 

చిరంజీవి మాట్లాడుతూ., మా నాన్నకు ఎస్వీ రంగారావు అంటే అమితమైన అభిమానం. నాన్న మాటల్లో రంగారావు గారి గొప్పతనం తీసుకున్నాను. అప్పుడే నటుడిని కావాలనే ఆలోచనకు బీజం పడినట్లు చిరంజీవి తెలిపారు. రాంచరణ్ నటుడిగా కెరీర్ ఆరంభించక ముందు ఎస్వీ రంగారావు నటించిన సినిమాలు చూడమని సలహా ఇచ్చినట్లు చిరంజీవి పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో హాస్య నటుడు బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తమ్మారెడ్డి భరద్వాజ అతిథులుగా పాల్గొన్నారు. ఎస్వీ రంగారావు మహా నటుడు పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రచించారు. మనుషులు బతికి ఉన్న పట్టించుకోని రోజులు ఇవి. అలాంటిది 45 ఏళ్ల తర్వాత రంగారావుపై పుస్తకం రాయడం అంటే ఆయన విలువ తెలుస్తోందని తనికెళ్ళ భరణి అన్నారు.