రీసెంట్ గా జరిగిన ఘటన? రీమేక్ సినిమాలపై చిరంజీవి కీలక నిర్ణయం.!?
మెగాస్టార్ చిరంజీవి చివరిగా ‘భోళా శంకర్’ తో అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫలితం తర్వాత.. చిరు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు రీసెంట్ గా ఓ ఘటన జరిగిందని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆరుపదుల వయస్సులోనూ యంగ్ స్టార్స్ కు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఎనర్జిటిక్ లుక్ తో వెండితెరపై అదరగొడుతున్నారు. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. మెగా అభిమానులను ఖుషీ చేశారు. రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘భోళా శంకర్’, అంతకు ముందుకు వచ్చిన ‘ఆచార్య’ మాత్రం డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలు రీమేక్ కావడం గమనార్హం.
చిరు రీఎంట్రీ ఇస్తూ 150.ఖైదీ నుంచి తీస్తున్న సినిమాల్లో రీమేక్ సినిమాలే ఎక్కువే ఉన్నాయి. అవన్నీ డిజాస్టర్ అవుతుండటంతో మెగా అభిమానులు, సినీ ప్రియులు కూడా కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఈ విషయం మెగాస్టార్ వరకూ వెళ్లింది. ఇదే విషయాన్ని చిరంజీవి ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ప్రస్తావించారు. కానీ రీమేక్ సినిమాలు చేయడంలో తప్పేముందని, మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులకు అందించడం మంచిదే కదా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు ఆ కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.
కానీ, Bholaa Shankar రిజల్ట్స్ మాత్రం దెబ్బతీసింది. సినిమా డిజాస్టర్ కావడంతో అభిమానులు అప్సెట్ అయ్యారు. దీంతో రీమేక్ సినిమాలపై చిరు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఓన్లీ స్ట్రెయిట్ చిత్రాలు చేసేందుకే మొగ్గుచూపుతున్నట్టు ఓ వార్త నెట్టింట హాట్ టాపిగ్గా మారింది. అయితే చిరు లైనప్ లో Mega 156, 157 చిత్రాలు ఫైనల్ అయ్యాయి. ఇప్పటికే చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ‘మెగా157’ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ‘బింబిసార’ డైరెక్టర్ మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. మిగిలిన విషయాలు త్వరలో రానున్నాయి.
ఇక ‘మెగా156’ గురించి అప్డేట్ అందాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కూతురు సుశ్మితా కొణిదెల నిర్మాతగా గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని సినీ వర్గాల సమాచారం. అయితే, ఈ కాంబోలో వచ్చే సినిమా రీమేక్ అయ్యి ఉంటుందని కొద్దిరోజులు ప్రచారం జరుగుతోంది. కానీ రీసెంట్ గా ఓ నిర్మాత మలయాళ చిత్ర రీమేక్స్ రైట్స్ తో చిరును కలిశారంట. చిరంజీవి మాత్రం ఆ ప్రొడ్యూసర్ కు సింపుల్ గా నో చెప్పారంట. ఈ ఘటనతో చిరు రీమేక్ సినిమాల పట్ల కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఇకపై డైరెక్ట్ తెలుగు సినిమానే చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరీ చిరు నెక్ట్స్ సినిమాల అప్డేట్ వచ్చే వరకు ఇందులో ఎంత నిజం ఉందనేది వేచి చూడాలి.