మరో రీమేక్‌పై చిరు మోజు పడుతున్నాడట. తమిళంలో అజిత్ నటించిన సినిమాని రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో `వేదాలం` ఎంతటి ఘన విజయాన్నిసాధించిందో తెలిసిందే. తెలుగులోనూ అనువాదమై ఆకట్టుకుంది.
చిరంజీవి రీమేక్‌లపై మోజు పడుతున్నాడు. రీఎంట్రీనే తమిళ చిత్రం `కత్తి`ని తెలుగులో `ఖైదీ నంబర్ 150`గా చేసి గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్నారు. ఆ తర్వాత హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`తో తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక సందేశం, వినోదం మేళవించిన `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ ఓ రీమేక్ చేయబోతున్నారు. మలయాళ చిత్రం `లూసిఫర్` రీమేక్‌లో నటించబోతున్న విషయం తెలిసిందే.
సుజిత్ ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. తన పుట్టిన రోజు కానుకగా, ఈ నెల 22న కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. దీన్ని రామ్‌చరణ్ నిర్మించబోతున్నారు. దీంతోపాటు మరో రీమేక్‌పై చిరు మోజు పడుతున్నాడట. తమిళంలో అజిత్ నటించిన సినిమాని రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో `వేదాలం` ఎంతటి ఘన విజయాన్నిసాధించిందో తెలిసిందే. తెలుగులోనూ అనువాదమై ఆకట్టుకుంది. అజిత్‌కి మాస్ ఇమేజ్‌ని రెట్టింపు చేసిందీ చిత్రం. ఆయన స్టయిలీష్ నటనకు, శివ మార్క్ టేకింగ్ ఆ సినిమా బాక్సాఫీసుని దద్దరిల్లేలా చేసింది.
తాజాగా సినిమాని చూసిన చిరు, తను హీరోగా తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మాస్ అంశాలు ఫ్యాన్స్ ఓ ఊపుఊపుతాయని, వారు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారట. దీన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మెహర్ రమేష్‌కి ఇవ్వబోతున్నట్టు టాక్. అంతేకాదు దీన్నే నిర్మించే అవకాశాన్ని తనకు ఇష్టమైన బ్యానర్ క్రియేటివ్ కమర్సియల్ బ్యానర్‌పై కే.ఎస్.రమారావుకి ఇవ్వాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఇది ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి. కానీ ఈ సినిమా చిరుకి నిజంగానే `శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్` లాంటి ఓ మాస్ ఇమేజ్‌ని తీసుకొస్తుందని నెటిజన్లు అంటున్నారు.
