రామ్‌చరణ్‌కి జాతీయ అవార్డు రాలేదు, కానీ.. చిరు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆస్కార్‌కి వెళ్లడం తండ్రిగా గర్వపడుతున్నా
చరణ్ నటనకు జాతీయ అవార్డులు రాకపోయినప్పటికీ ఆడియెన్స్ గుండెల్లో ఉన్నాడన్నారు. ఇప్పటికీ చరణ్ నటన గురించి మాట్లాడుకున్నారంటే అది ఎన్నో జాతీయ అవార్డులతో సమానం అని తెలిపారు చిరంజీవి.

తనయుడు రామ్‌చరణ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు చిరు. `ఆర్‌ఆర్‌ఆర్`లో ఆయన చూపించిన నటన పట్ల గర్వ పడుతున్నట్టు తెలిపారు. అంతేకాదు `ఆర్‌ఆర్‌ఆర్`తో ఆస్కార్ వరకు వెళ్లడం పట్ల చాలా ఆనందంగా ఉందని, అందులో చరణ్ నటించడం చాలా గర్వంగా ఉందని, చరణ్ స్థానంలో నేనే ఉన్నట్టుగా భావిస్తున్నా అని తెలిపారు మెగాస్టార్.
`రంగస్థలం` సినిమాలో చరణ్ నటన గురించి చెబుతూ, అందులో చెవిటి వాడిలా చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయాడని, అద్భుతమైన నటన కనబరిచాడని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం వల్ల ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేసినట్టు చెప్పాడని చిరు తెలిపారు. అయితే అందులో చరణ్ నటనకు జాతీయ అవార్డులు రాకపోయినప్పటికీ ఆడియెన్స్ గుండెల్లో ఉన్నాడన్నారు. ఇప్పటికీ చరణ్ నటన గురించి మాట్లాడుకున్నారంటే అది ఎన్నో జాతీయ అవార్డులతో సమానం అని తెలిపారు చిరంజీవి. ఆ సినిమాలో చరణ్ నటన చూసి గర్వ పడుతున్నట్టు తెలిపారు.
ఇంకా చిరంజీవి చెబుతూ, ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్`లో విశ్వరూపం చూపించారని, ఎన్నో షేడ్స్ కనబరిచాడని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో, కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని `నాటునాటు` పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని, ఇప్పుడు ఆస్కార్ పోటీలో నిలిచిందన్నారు. ఇంతకంటే ఓ తెలుగువాడికి ఏం కావాలన్నారు చిరంజీవి. అయితే ఇందులో రామ్‌చరణ్ నటించడం గర్వంగా ఉందన్నారు. అంతేకాదు ఓతండ్రిగా దాన్ని ఎంతో గర్వ పడుతున్నానని, చరణ్ పాత్రలో తానే ఉన్నట్టుగా భావిస్తున్నానని చెప్పారు.
చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్‌గా, రవితేజ, కేథరిన్ కీలక పాత్రల్లో నటించిన `వాల్తేర్ వీరయ్య` చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. ఈ చిత్రం యావరేజ్ టాక్‌ని తెచ్చుకున్నా, భారీ కలెక్షన్లని రాబడుతుంది. ఇది ఇప్పటికే రెండు వందల కోట్లు దాటి,రూ.250కోట్ల దిశగా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హన్మకొండలో `వాల్తేర్ వీరయ్య` విజయవిహారం పేరుతో సక్సెస్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో రామ్‌చరణ్ గెస్ట్ గా పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా పాల్గొన్నారు. వరంగల్‌లో స్టూడియో నిర్మించాలని, అందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్, తమ సపోర్ట్ ఉంటుందన్నారు.