స్టార్ సింగర్స్ అంతా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళారు.. డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్ లో దిగారు.. ఇక అక్కడ స్టార్ట్ అయ్యింది గానా బజానా.. ఇంతకీ అక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఏంటి..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర’సినిమా చేస్తున్నారు. ఈసంగతి తెలిసిందే. ఈమూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు చిరు. గత సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఈ సినిమా హిట్ మెగాస్టార్ కు చాలా కీలకం. ఈ సంగతి కూడా తెలిసిందే. ఇక అందుకే సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు చిరు. ప్రతీది దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?
సినిమాకు సబంధిచిన ప్రతీ అంశంలో ఆయన పాలుపంచుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో సినిమాలకు ముందు పాటలతోనే పని మొదలుపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆనవాయితీ పోవడంతో విశ్వంభర సినిమాతో మళ్ళీ అలాగే పాటలతోనే పని మొదలుపెట్టారు. అయితే ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పాల్గొనడమే కాదు.. ఆయన స్వయంగా తన సొంత ఫామ్ హౌస్ లో ఈ సిట్టింగ్స్ ను ఏర్పాటు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?
రీసెంట్ గా విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ చాలా కోలాహలంగా జరిగాయి. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతని టీమ్, డైరెక్టర్, నిర్మాత.. ఇలా అందరూ విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కీరవాణి పుట్టినరోజు సందర్భంగా తన సోసల్ మీడియా పేజ్ లో ఈ వీడియోను శేర్ చేయగా.. ఈ వీడియో వైరల్ గా మారింది.
కీరవాణి తో పాటు ఈ సినిమాకు పాటలు పాడే సింగర్స్... అండ్ ఆర్కెష్ట్రా టీమ్ అంతా చిరంజీవి బెంగుళూరు ఫామ్ హౌస్ కి వెళ్లారు. అక్కడ ఎంతో కోలాహలంగా వేడుకు చేసుకుని.. మ్యూజిక్ సిట్టింగ్స్ ను కంప్టీట్ చేసుకుని వచ్చేశారు. ఈక్రమంలో ఈవీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
