`ఆచార్య`ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. బాస్‌ ఈజ్‌ కమింగ్‌ అనేలా ఆయన వస్తుంటే ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ఇందులో చిరంజీవిపై దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఆచార్య`(Acharya). రామ్‌చరణ్‌(Ram Charan) మరో హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్‌ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్‌, చరణ్‌కి జంటగా పూజా హెగ్డే నటించింది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్‌లో `ఆచార్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌(Acharya Pre Release Event)ని నిర్వహించారు. 

తాజాగా చిరంజీవి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. బాస్‌ ఈజ్‌ కమింగ్‌ అనేలా ఆయన వస్తుంటే ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. అభిమానుల అరుపుతో మారుమోగింది. హోరుకి, చిరు ఎంట్రీ సైతం అదే రేంజ్‌లో ఉండటం విశేషం. యాంకర్‌ సుమ కనకాల కూడా చిరంజీవికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. ఇక ఇందులో చిరంజీవిపై దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో `మెగా 154` చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు బాబీ(Boby).. `ఆచార్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్‌ స్థానం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ పదిళమే అని, ఆయన ఛైర్ ని మరెవ్వరూ భర్తీ చేయలేరని తెలిపారు. 

తాను చిరంజీవి అభిమానిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. మెల్లమెల్లగా స్టేజ్‌పై ఇప్పుడు మైక్‌ పట్టుకునే స్థాయికి వచ్చానని చెప్పారు బాబీ. ముందుగా తనకు టికెట్లు, బెనిఫిట్‌ షోలు అలవాటు చేసిన నాన్న గారికి థ్యాంక్స్ చెప్పారు బాబీ. అద్భుతమైన కథ రాసి, చిరంజీవిని, రామ్‌చరణ్‌ని ఒకే తెరపై చూపించబోతున్నందుకు దర్శకుడు కొరటాల శివకి ధన్యవాదాలు చెప్పారు. కొరటాల చిత్రంలో బలమైన కథ, ఎమోషన్స్ ఉంటాయని, అంతిమంగా ఒక సోల్‌ని క్రియేట్‌ చేస్తారని చెప్పారు. 

ఫ్యాన్‌గా చూసిన చిరంజీవిని ఇప్పుడై డైరెక్ట్‌ చేస్తున్నానని, అభిమానిగా ఆయన్ని సెట్‌లో చూస్తుంటే ప్రతి రోజూ ఆయన ఎందుకు మెగాస్టార్‌ అయ్యారో తెలుస్తుందన్నారు. ప్రతి రోజు ఏదో కొత్త విషయాన్ని చెబుతారని, ఆయన్నుంచి ప్రతి రోజు నేర్చుకుంటామని చెప్పారు. అయితే ఆయన మెగాస్టార్‌ ఇందుకు అయ్యి ఉంటారని ప్రతి రోజు తనుకో ప్రశ్న ఉంటుందని, కానీ మరో రోజువస్తే ఇంకో విషయంలో ఆయనమెగాస్టార్‌ అయ్యారనేది ఆయన చేతలతో తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా చూసి వచ్చాక రామ్‌చరణ్‌ బాగా చేశారని చిరంజీవితో అంటే, ఎన్టీఆర్‌ కూడా అద్భుతంగా చేశారని, మరో హీరోని కూడా అంతగా ప్రత్యేకంగా ప్రశంసించడం ఆయన గొప్పతనం. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు. 

షూటింగ్‌ 7గంటలకు అయితే 6 గంటలకే విత్‌ మేకప్‌తో ఉంటారు, వన్‌ మోర్‌ అని పది సార్లు అడిగినా ఎందుకు బాబీ అని ఒక్క ప్రశ్న కూడా అడగరు. మరో షాట్‌ కోసం రెడీగా ఉంటారు. ఎప్పుడే పదేళ్ల క్రితం తన చైర్‌ని.. `ఇంద్ర` సినిమాలోలాగ సీమ ప్రజల కోసం వారణాసి వెళ్లిపోయి, మళ్లీ పదేళ్ల తర్వాత వస్తే అదే ఛైర్ ఉన్నట్టు, ఆయన ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయాక కూడా ఆయన చైర్‌ అలాగే ఉంది. `అత్తారింటికి దారేదీ` లో ఓ డైలాగ్‌ ఉంటుంది. `మీకోసం ఎప్పుడు ఒక చైర్‌, ఒక టేబుల్‌, ఒక ప్లేట్‌ అలానే ఉంటుందన్నట్టు, ఆయన చైర్‌ని అలాగే ఉంచిన మిగతా హీరోలకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అని వెల్లడించారు దర్శకుడు బాబీ. చిత్ర యూనిట్‌కి, సంగీత దర్శకుడు, రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్స్ కి ఆయన అభినందనలు తెలిపారు.