మెగాస్టార్  గత చిత్రం సైరా లోనూ అమితాబ్ ని తెచ్చి కీ రోల్ ఇచ్చారు. హిందీ మార్కెట్ బాగుంటుందని భావించారు. కానీ ఆడలేదు. ఇప్పుడూ అదే పరిస్దితి. అయితే గాడ్ ఫాధర్ నిజానికి బాగా నడవాల్సిందే. 


మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం "గాడ్ ఫాదర్". దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ మూవీకు మంచి ఓపినింగ్సే వచ్చాయి. తెలుగులో దసరా విన్నర్ అయ్యింది. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. జరిగిన బిజినెస్, వచ్చిన కలెక్షన్స్ తో పోల్చి చూస్తే ఇంకా రికవరీ కావాల్సింది చాలా ఉందని ట్రేడ్ అంటోంది. ఇదిలా ఉంటే ఈ సినమాని హిందీలోనూ భారీగా రిలీజ్ చేసారు.

సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కావటంతో నార్త్ లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లను నమోదు చేస్తుందని అంచనా వేసారు. హిందీలో మొదట బాగుంది. గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు మరో 600 థియేటర్లను పెంచుతున్నట్టు తెలుపుతూ, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియోను రిలీజ్ చేసారు. మరొక వీడియోలో సల్లూభాయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలానే గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు చూపిస్తున్న విశేష ఆదరణకు నార్త్ ఆడియన్స్ కు చిరు థాంక్స్ చెప్పారు. దాంతో అక్కడ భారీగా వర్కవుట్ అవుతోందని అనుకున్నారు. అయితే ఆరు రోజుల్లో .. కేవలం 4.30 కోట్లు మాత్రమే వచ్చిందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ గెస్ట్ గా చేసినా అక్కడ ప్రభంజనం కనపడలేదు. 

మెగాస్టార్ గత చిత్రం సైరా లోనూ అమితాబ్ ని తెచ్చి కీ రోల్ ఇచ్చారు. హిందీ మార్కెట్ బాగుంటుందని భావించారు. కానీ ఆడలేదు. ఇప్పుడూ అదే పరిస్దితి. అయితే గాడ్ ఫాధర్ నిజానికి బాగా నడవాల్సిందే. అనుకున్న స్దాయిలో ప్రమోషన్స్ జరగలేదు. కేవలం ప్రెస్ మీట్ల ద్వారా ఈ సినిమాని అక్కడ వచ్చిందని తెలియచేసారు. ఇదే లెక్కన ముందుకు వెళ్తే కేవలం ఐదారు కోట్లు మాత్రమే ఫుల్ రన్ లో వచ్చే అవకాసం ఉందని లెక్కలు వేస్తోంటి బాలీవుడ్ ట్రేడ్. ఇదిలా ఉంటే తెలుగు చిత్రం కార్తికేయ 2 హిందీ డబ్బింగ్ వెర్షన్ ఫుల్ రన్ లో హిందీ బెల్ట్ లో 30 కోట్లుదాకా వసూలు చేసింది. 

మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, అనసూయ, షఫీ కీలకపాత్రలు పోషించారు. కే ‘గాడ్ ఫాదర్’ మూవీలో డైలాగులు.. నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. మరోవైపు ఇన్నాళ్లు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఒక్కక్కళ్లు.. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా.. ఇందులో ఒకటే రూల్.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించే నిర్ణయం, తప్పచేయ్యాలంటే ఓ భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి.. లేదంటే .. మీ ఊపరి గాల్లో కలిసిపోతుంది. అంటూ చెప్పిన మరో డైలాగు కూడా పాపులర్ అయింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి జన జాగృతి పార్టీని కాపాడే గాడ్ ఫాదర్ పాత్రలో కనిపించారు చిరంజీవి.