ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనను మెగాస్టార్ చిరంజీవి తగ్గించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ తాజా ఆరోగ్య పరిస్ధితిపై చిరంజీవి అప్డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒక్కొక్కరిగా కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తుంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు మెగా హీరోలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. గత నెలలో అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. 15రోజుల ఐసోలేషన్, చికిత్స తరువాత అల్లు అర్జున్ కోలుకున్నారు. తాను కరోనా నుండి బయటపడినట్లు, కరోనా నెగిటివ్ గా ఫలితం వచ్చినట్లు అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
కాగా ఈనెల 10న ఎన్టీఆర్ కి కరోనా సోకింది. తాను కరోనా బారినపడినట్లు ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేశారు. ఎన్టీఆర్ కి కరోనా సోకిందన్న వార్త ఆయన ఫ్యాన్స్ ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనను మెగాస్టార్ చిరంజీవి తగ్గించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ తాజా ఆరోగ్య పరిస్ధితిపై చిరంజీవి అప్డేట్ ఇచ్చారు.
కొద్దిసేపటి క్రితం చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. తారక్ తో ఫోన్ లో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ అవడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు బాగున్నారు. ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాడని అర్థం అవుతుంది. త్వరలోనే పూర్తిగా కోలుకుని బయటికి వస్తారని ఆశిస్తున్నాను... అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని చిరు పరోక్షంగా చెప్పిన నేపథ్యంలో ఫ్యాన్స్ పండగలా ఫీలవుతున్నారు. అలాగే తమ హీరో లేటెస్ట్ కండిషన్ పై అప్డేట్ ఇచ్చినందుకు చిరంజీవికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అక్టోబర్ 13 ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీగా ప్రకటించగా, షూటింగ్ చివరి దశలో ఉంది.
