పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తున్నారు.దీనిపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. మైక్ దొరికితే, సందర్భం పవన్ అయితే నాన్‌స్టాప్‌గా ప్రశంసలు కురిపిస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు బండ్ల గణేష్. పూనకం వచ్చినట్టుగా ఊగిపోతుంటాడు. పవన్‌ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. పవన్‌ని దేవర అంటూ దేవుడిగా స్మరించుకుంటాడు బండ్ల గణేష్. ఆయనతో మరోసారి సినిమా చేసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు బండ్ల గణేష్.
పవన్‌కి రాజకీయంగానూ తన మద్దతు తెలియజేస్తుంటారు బండ్ల గణేష్. కానీ దానికి చాలాపరిమితులున్నాయి. హీరోగా, వ్యక్తిగా పవన్‌ని ఇష్టపడే బండ్ల గణేష్ రాజకీయంగా మాత్రం సపోర్ట్ చేయడం వరకే పరిమితమయ్యాడు. అయితే తాజాగా రాజకీయంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తాను జనసేనలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నాడనే సంకేతాలనివ్వడం విశేషం. అయితే బండ్ల గణేష్ ఇలా ట్వీట్ చేయడానికి చిరంజీవి కారణం కావడం విశేషం.
తాడపర్తికి చెందిన ఓ నాయకుడు చిరంజీవిని జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. `చిరంజీవిగారు జనసేనలోకి రావాలి. పార్టీని అధికారంలోకి తేవాలి. మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించాలి. అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలి. రాముడులోని సౌమ్యం మీరు, లక్ష్మణుడిలోని తెగింపు తమ్ముడిది. ఇద్దరు కలిస్తే రామరాజ్యం అవుతుంది అంటూ బండ్ల గణేష్, చిరంజీవి పేర్లని ట్యాగ్ చేశాడు సదరు నెటిజన్. దీనిపై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. `మరి నేను` అంటూ రిప్లై ఇచ్చారు. మరి నన్ను ఆహ్వానించడం లేదనే కోణంలో ఆయన పోస్ట్ పెట్టగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నిజంగానే బండ్ల గణేష్ జనసేనలోకి వెళ్లిందుకు సిద్ధంగా ఉన్నాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే గతంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల్లోనూ పోటీ చేయాలనుకున్నారు. కానీ టికెట్ రాలేదు. దీంతో నిరాశ చెందిన బండ్ల గణేష్ ఆ మధ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు `మరి నేను` అనే ట్వీట్‌తో మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. మరి ఆయనకు జనసేనలోకి చేరే ఆలోచన ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నారు బండ్ల గణేష్. ఆ మధ్య మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించారు. ఇప్పుడు ఆయన మెయిన్ లీడ్‌గా `డేగల బాబ్జీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతుంది.
