Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి దాతృత్వానికి ఫిదా అయిన చిరంజీవి

చిరంజీవికి అన్షి అనే చిన్నారి ఆలోచన తనని మరింతగా ఇన్స్‌పిరేషన్ చేసిందట. తన పుట్టినరోజు సందర్భంగా తాను దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. 

chiranjeevi fidaa to child donate saving money and her birthday celabration amount arj
Author
Hyderabad, First Published Jun 1, 2021, 7:44 PM IST

మెగాస్టార్‌ చిరంజీవిని ఓ చిన్నారి ఫిదా చేసింది. తాను బర్త్ డే సెలబ్రేషన్స్ ని రద్దు చేసుకుని మరీ చిరంజీవి ట్రస్ట్ కి విరాళంగా అందించడంతో ఆ చిన్నారి చేసిన పనికి చిరు ఫిదా అయిపోయాడు. ఈ సందర్భంగా ఆ చిన్నారిని అభినందించాడు. అన్షి అనే చిన్నారి తనను ఎంతగానో ఇన్స్‌పైర్ చేసిందని చిరంజీవి అన్నారు. చిరు కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి. చాలా మంది కరోనా రోగులకు ఆక్సిజన్ బ్యాంకుల సేవలు అందుతున్నాయి. 

ఈ క్రమంలో చిరంజీవికి అన్షి అనే చిన్నారి ఆలోచన తనని మరింతగా ఇన్స్‌పిరేషన్ చేసిందట. తన పుట్టినరోజు సందర్భంగా తాను దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు. `పి.శ్రీనివాస్, హరిణి గార్ల చిన్నారి పేరు అన్షి ప్రభాల. జూన్ 1న తన బర్త్ డే. తను దాచుకున్న డబ్బుతో పాటు తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. 

ఈ సందర్భంగా తను ఏమంటోందంటే..`తను చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది అని`. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినపోయాను. అన్షి చూపి స్పందన నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది. తన డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని నేను విష్ చేస్తున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.  భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అన్షి. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ డార్లింగ్` అని చిరు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios