మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. రామ్ చరణ్ సాధించిన ఘనతను తలుచుకుని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ప్రపంచం మెచ్చిన దిగ్గజ దర్శకుడు రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించడంతో ఆనందం ఆపుకోలేకపోయారు మెగాస్టార్. 

ఆస్కార్ బరలో చివరి దశలోకి చేరింది ఆర్ఆర్ఆర్. ఆస్కార్ వేడుకలు త్వరలో జరగబోతుండగా.. సినిమా ప్రేమికుల్లో ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మన తెలుగు ఆడయన్స్ అయితే ఎప్పుడెప్పుడు రిజల్ట్ తెలుస్తుందా అని ఎదరు చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నుంచి ఓరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచింది నాటు నాటు సాంగ్. ఈపాటకు ఆస్కార్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అంతా. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాపై.. హాలీవుడ్ ప్రముఖుల నుంచిప్రశంసల వర్షం ఆగడంలేదు. రీసెంట్ గా మరోసారి ఈసినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు హాలీవుడ్ దర్శకుడు.. టైటానిక్, అవతార్ సినిమాల ఫేమ్ జేమ్స్ కామరూన్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈసినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు కామరూన్. 

ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ కామరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాగురించి గుర్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆపాత్ర తనకు ఎంతో నచ్చిందంటూ కితాబిచ్చారు కామరూన్ కాకపోతే ఆ పాత్రను అర్ధం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుందన్నారు. కాని ఒక సారి ఆ పాత్ర అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు. సరిగ్గ అక్కడే దర్శకుడు విజయం సాధించాడంటూ రాజమౌళి గురించి వ్యాఖ్యానించారు జేమ్స్ కామరూన్. 

అంతే కాదు ఇదే విషయం తాను స్వయంగా రాజమౌళికి కూడా చెప్పానన్నారు జేమ్స్. కాని ఆ దర్శకుడితో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదున్నారు. అతనితో ఎక్కువ మాట్లాడలేకపోయానని, జనసందోహం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం గడపలేకపోయానన్నారు. మరోసారి టైమ్ దొరికితే మాత్రం తప్పకుండా రాజమౌళితో మాట్లాడి సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ఉందని అన్నారు దిగ్గజ దర్శకుడు. తాను కెనాడాకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఇండియన్స్ ఈ సినిమా చూశాక ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోగలనని అన్నారు. ఇందులో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఇక దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జేమ్స్ కామెరూన్ తన కొడుకుని ఇలా పొగడంతో చిరంజీవి సంతోషం పట్టలేక పోయారు. వెంటనే ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టరా్ ఏమన్నారంటే.. జేమ్స్ కామరూన్ సర్... మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవం. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, జేమ్స్ కామెరాన్ మాట్లాడిన వీడియోను కూడా శేర్ చేశారు మెగాస్టార్.

ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు వేధికల మీద తన సత్తా చాటుకుంది ఆర్ఆర్ఆర్. ఎన్నో అవార్డ్ లను కైవసం చేసుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ నుకూడా సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇక ఆస్కార్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరిసీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రలు అద్భుతంగా పండాయి. చరణ్ జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా బ్రిటీష్ మోడల్ ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణిసంగీతం అందించారు.