తెలుగు ఓటీటీ 'ఆహా'లో సామ్‌ జామ్‌ ప్రోగ్రామ్‌ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. హీరోయిన్‌ సమంత యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మధ్యే మెగాస్టార్‌ చిరంజీవి సామ్‌తో కలిసి సందడి చేయగా తాజాగా అల్లు అర్జున్‌ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన ఆహా పూర్తి ఎపిసోడ్‌ త్వరలో చూడవచ్చని తెలిపింది. అయితే ప్రోమోలో అల్లు అర్జున్‌కు ముందు "మెగాస్టార్‌" అని డిక్లేర్ చేసి రాసేసారు.  

ఇది చూసి చిర్రెత్తిపోయిన చిరు ఫ్యాన్స్‌ 'ఆహా'పై తీవ్రంగా మండిపడ్డారు.  “మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమే….. ఇలా చేస్తే ఊరుకోము,”మా చిరంజీవి బిరుదును అందుకునే అర్హత ఏ హీరోకు లేదని ఓ రేంజిలో ఫైర్‌ అవుతున్నారు. మెగాస్టార్ ఫాన్స్ “ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మంచిది” అని బన్ని ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా బన్నీని బ్రహ్మానందం ఫేస్ తో ట్రోల్ చేయటం మొదలెట్టారు. దాంతో మరింత డ్యామేజ్ జరగకుండా ఒక క్షమాపణల ట్వీట్ వేసారు. “ఎవరైతే హర్ట్  అయ్యారో వాళ్ళకి” క్షమాపణలు అంటూ తెలియచేసింది.  “మెగాస్టార్ ఉన్నది ఒక్కరే… ఆయనెవరో మీకు, మాకు అందరికి తెలుసు” అంది.

 ఆహా మెగాస్టార్‌ ట్యాగ్‌ను తీసి, స్టైలిష్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌ యాడ్‌ చేసి తన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.  అయితే ఇది కావాలని చేసింది కాదని పొరపాటని అంటున్నారు. అంతకు ముందు ఎపిసోడ్‌లో చిరంజీవి పాల్గొన్నందున మెగాస్టార్‌ అనే ట్యాగ్‌ను తీసేయకుండా అలాగే ఉంచేసారు టెక్నికల్‌ టీమ్‌ అని చెప్తున్నారు. అబ్బే ఇదంతా కవరింగ్ చిరు ఫ్యాన్స్ శివమెత్తుతున్నారు.