ఉత్తరాంధ్రకు చెందిన మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ఒకరు హఠాత్తుగా మరణించారు. ఆయన మృతి.. మెగా ఫ్యాన్స్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. మెగా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే అభిమాని మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఉత్తరాంధ్ర మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం కన్వినర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వివరాలు చూస్తే.. మధురవాడ కు చెందిన చిరంజీవి అభిమాన సంఘం కన్వినర్, జనసేన నేత ఆర్టీసి డ్రైవర్ గా పనిచేస్తున్న యడ్ల లక్ష్మణ్ యాదవ్ (52) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణంచారు. రోజులాగానే డ్రైవర్ గా తన డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరిన లక్ష్మణ్.. బైక్ పై హైవే మీద వస్తుండగా.. సడెన్ గా రెడ్ సిగ్నల్ చూసి బ్రేక్ వేశాడు. అతని బండి ఆగడంతో వెనకనుంచి వస్తున్న లారీ కంట్రోల్ తప్పి.. లక్ష్మణ్ బైక్ ను బలంగా ఢీకొట్టంది. దాంతో ఎగిరి పడిన ఆయన రోడ్డుకు బలంగా తగలడంతో అక్కడిక్కక్కడే మరణించారు. 

మెగా ఫ్యామిలీకి..ముఖ్యంగా చిరంజీవికి వీరాభిమానిగా ఉన్న లక్ష్మణ్ యాదవ్.. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరి.. ఆ ప్రాంతంలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే లక్ష్మణ్ ను విశాఖపట్నం కెజిహెచ్ కు తరలించారు. విషయం తెలసుకున్న మెగా అభిమానులు, జనసేన నాయకులు లక్ష్మణ్ కుటుంభ సభ్యులను కలిసి ఓదారుస్తున్నారు.

 కాగా లక్ష్మణ్ కు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి చేసిన మెగా అభిమాని.. భీమిలీ నియోజకవర్గంలో జనసేన నుంచి చాలా యాక్టీవ్ గా ఉన్నారు. ఆయన భార్య కూడా విశాఖపట్నం లోని ఐదోవార్డ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. లక్ష్మణ్ మరణ వార్త తెలియగానే జనసేన నాయకులతో పాటు ఇతర పార్టీలన నేతలు కూడా వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.