Asianet News TeluguAsianet News Telugu

ఊరికినే మెగాస్టార్ అయిపోరు... చిరంజీవి ఫెరఫార్మెన్స్ చూసారా?

కమిడియన్ సత్య షాట్ రెడీ అనగానే చిరంజీవిలో నుంచి ఆత్మారావు బయటకొస్తాడు. 

Chiranjeevi delights with Country Delight commercial jsp
Author
First Published Sep 8, 2024, 12:17 PM IST | Last Updated Sep 8, 2024, 12:17 PM IST


చిరంజీవి చేసిన ఓ అడ్వర్టైజ్ మెంట్  ఇప్పుడు సోషల్ మీడియాలోకి ట్రెండింగ్ లోకి వచ్చింది. మిల్క్ బ్రాండ్ కోసం చిరు ఈ యాడ్ చేశారు. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ ఈ యాడ్ కి డైరెక్టర్. చూసిన వాళ్లంతా ఈ యాడ్ లో చిరు పర్ఫామెన్స్ అదుర్స్ అంటున్నారు. ముఖ్యంగా ఊరికినే మెగాస్టార్ అయిపోరు అంటూ చివర్లో వినిపించే డైలాగ్ ఈ యాడ్ కే హైలైట్. ఇందులో చిరంజీవి యాడ్ కోసం డైలాగ్ వెర్షన్ ప్రిపేర్ అవుతుంటారు చిరంజీవి. ఒరిజినల్ యాడ్ తీసింది దర్శకుడు హరీష్ శంకర్ అయితే, ఈ యాడ్ లో కనిపించే యాడ్ ఫిలిం మేకర్ కమెడియన్ సత్య.

కమిడియన్ సత్య షాట్ రెడీ అనగానే చిరంజీవిలో నుంచి ఆత్మారావు బయటకొస్తాడు. ఈ ఆత్మారావు మనకు అన్నయ్య సినిమాలో కనపడతాడు. అన్నయ్య మూవీలో కామెడీని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది ఈ ఆత్మారావే అన్నది అందరికి గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఆ క్యారెక్టర్ ని ఇక్కడ యాడ్ కోసం వాడుకున్నారు. యాడ్ లో నటించే చిరంజీవి క్లాస్ గా ఉంటే, ఆత్మారావుది మాస్ క్యారెక్టర్. గీతల చొక్కా, లుంగీ, కళ్లద్దాలు పెట్టుకుని ఆత్మారావు ఎంట్రీ ఇస్తాడు. వీరిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ లోనే పాల బ్రాండ్, దాని గొప్పదనం, పాలను బుక్ చేసుకునే యాప్... అన్ని వివరాలు చెప్పించారు. 

మెగాస్టార్ చిరంజీవి  ప్రకటనల్లో అరుదుగా కనిపిస్తుంటారు. అయితే ఇటీవల ‘కంట్రీ డిలైట్’ యాడ్‌లో ఆయన మెరవంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తన మార్క్ నటనతో చిరంజీవి ఈ యాడ్‌లో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా మాస్ కాంబో నుంచి మాస్ కమర్షియల్ యాడ్ అంటూ అభిమానులు  మురిసిపోతున్నారు. కాగా ‘కంట్రీ డిలైట్’ రూపొందించిన ఈ యాడ్‌లో చిరంజీవి నటించగా డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇదిగో ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios