బ్యాచిలర్‌ లైఫ్‌కి బై..బై చెబుతూ మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్‌ పొందనుంది మెగా ప్రిన్సెస్‌ నిహారిక కొణిదెల. ఈ క్రమంలో మెగా కుటుంబంలో ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివాహ ముహూర్తం దగ్గర పడుతుండడంతో మెగా-అల్లు కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ దగ్గరుండి తన సోదరి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు.  

ఈ వేడుకల్లో భాగంగా...చిరు స్టెప్పేస్తే దుమ్మురేగిపోద్ది అని ఇప్పుడు కూడా నిరూపిస్తున్నారు మెగాస్టార్. 60 ఏళ్లు దాటినా ఆయనలో ఇంకా అదే జోష్, అవే స్టెప్పులు. అనుమానంగా ఉంటే నీహారిక పెళ్లిలో ఆయన చేసిన హంగామాకు గుర్తుగా వేసిన స్టెప్స్ తో కూడిన ఈ వీడియో చూడండి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇదే పాటను ‘మగధీర’లో రీమేక్ కూడా చేశారు. తన కెరీర్‌లో మంచి ఫేమస్ సాంగ్ అయిన ‘బంగారు కోడిపెట్ట’కు తాజాగా మెగాస్టార్ డ్యాన్స్ చేశారు. అల్లు అర్జున్ తో కలిసి నీహారిక వెడ్డింగ్ లో డాన్స్ లతో చిరు రచ్చ చేసారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వేడుకల్లో ఈ డాన్స్ ని అందరూ బాగా ఎంజాయ్ చేశారు. తన వాళ్ల కోసం చిరంజీవి రకరకాల ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. వాటిలో ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి. బంగారు కోడిపెట్ట పాట స్టెప్స్ లో  చిరంజీవి  డ్యాన్స్ ఇరగదీశారు. 60 ఏళ్లు దాటినా మెగాస్టార్‌లో ఇంకా అదే జోష్.  కె.రాఘవేంద్రరావు దర్వకత్వంలో చిరంజీవి, నగ్మ, వాణి విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ఘరానా మొగుడు. ఎంఎం కీరవాణి బాణీలు సమకూర్చారు.