మెగాస్టార్ చిరంజీవి హీరో గా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మేజర్ షూటింగ్ అయిపోగా.. మిగిలన పనులకోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరో గా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మేజర్ షూటింగ్ అయిపోగా.. మిగిలన పనులకోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్ డేట్ ను స్వయంగా తానే రిలీజ్ చేశారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ లూసీఫర్కు రీమేక్. ఇక ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ కు సబంధించిన షూటింగ్ కూడా ఆ మధ్య ముంబయ్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి వారంరోజుల పాటు అక్కడే సల్మాన్ గెస్ట్ హౌస్ లో ఉండి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చారు.
ఇక తాజాగా, చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై వచ్చే ఓ పాటకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మెగాస్టార్. స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలు దీనికి సంబంధించి విషయాలు వెల్లడించారు. వీరిద్దరి మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోను కూడా మెగాస్టార్ పంచుకున్నారు.
దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ ను ఉద్దేశిస్తూ.. భాయ్ తో కాలు కదిపానని, ప్రభుదేవా అద్భుతంగా పాటకు డాన్స్ ను కంపోజ్ చేశాడని చిరంజీవి పేర్కొన్నారు. ఈపాట కచ్చితంగా కన్నులపండుగలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ గా చిరంజీవి సరసన నయనతార . తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక రీసెంట్ గా ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో డిస్సపాయింట్ లో ఉన్నాడు చిరంజీవి. దాంతో తన నెక్ట్స్ సినిమాలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యావహరిస్తున్నాడు. షూటింగ్స్ చివరి దశలో ఉన్న సినిమాల విషయంలో కూడా ఒక సారి చెక్ చేసుకోమంటూ అందరికి చెప్పారట మెగాస్టార్. ఇక ఈ దసరా వరకూ గాడ్ ఫాదర్ మూవీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు మెగాస్టార్. దసరా బరిలో పెద్ద పెద్ద సినిమాలు పోటీకి ఉండే అవకాశం ఉంది.
