ఈ మధ్య కాలంలో బహిరంగ వేదికల్లో ప్రసంగించిన ప్రతిసారి చిరంజీవి ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన శృతి హాసన్ పై నవ్వుతూ అసహనం ప్రదర్శించారు. ఆమెను ఎవరో బెదిరించారని చెప్పి ఆరోపణలకు తెరలేపారు.  

పరిశ్రమలో చిరంజీవి(Chiranjeevi)కి సౌమ్యుడు అనే పేరుంది. తొందరపడి ఆయన ఎవరినీ మాట అనరు అంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం అని చెప్తారు. వయసు పెరిగేకుంది ఆయనలో మరింత సహనం, పరిపక్వత రావాలి. దానికి భిన్నంగా చిరంజీవి చర్యలు ఉంటున్నాయి. దర్శకుడు కొరటాల శివను ఆయన పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా సందర్భం తీసుకొచ్చి చురకలు వేస్తున్నారు. ఒక ప్లాప్ మూవీ ఇచ్చినందుకు ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సినిమా అనేది పెద్ద జూదం, టాలీవుడ్ హిట్ పర్సెంటేజ్ 2% మాత్రమే. అంటే ప్రతి వంద సినిమాలకు ఆడేది రెండే. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న చిరంజీవి ప్లాప్ ఇచ్చాడని కొరటాలపై విమర్శలు గుప్పించడం దారుణ పరిణామం. ఒకవేళ పరాజయానికి మించి అంతర్గత వివాదాలు ఏమైనా ఉన్నాయా? అవి ఏమిటో చెబితే బెటర్. అలా కాకుండా ఆర్థికంగా నష్టపోయి, మానసిక వేదనలో ఉన్న కొరటాల ఆత్మస్తైర్యాన్ని మరింత దెబ్బతీయడం సరికాదు. ఆచార్యకు మించిన అట్టర్ ప్లాప్స్ చిరంజీవి కెరీర్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. 

వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్లో సైతం చిరంజీవి కొరటాలపై మాటల దాడి చేశారు. అలాగే పైకి నవ్వుతూ శృతి హాసన్ పై అక్కసు వెళ్లగక్కారు ఆయన. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శృతి హాజరు కాలేదు. ఆమె ప్రస్తావన తెస్తూ... 'ఒంగోలులో ఏం జరిగిందో తెలియదు, సడన్ గా జ్వరం వచ్చిందట!' అన్నారు. ఇది ఆయన స్థాయికి తగిన కామెంట్ కాదు. మరో కామెంట్ గా ఆమెను ఎవరైనా బెదిరించారేమో, అన్నారు. 

వీరసింహారెడ్డి(Veerasimhareddy) ప్రీ రిలీజ్ కి వచ్చి, మా మూవీకి మాత్రం డుమ్మా కొట్టిందనేది చిరంజీవి అసహనానికి కారణం. శృతి హాసన్ ని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?. రెండు చిత్రాల నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కాబట్టి...వారు చేయరు. ఇక పోతే ఆయన సంక్రాంతి ప్రత్యర్థి హీరో బాలకృష్ణ హీరోయిన్ శ్రుతిని బెదిరించి ఉండాలి. బాలయ్య అంత చీఫ్ ఆలోచిస్తాడంటే నమ్మలేం. శృతిని బెదిరించారు అనే ఆరోపణ వెనుక కారణం అయితే ఉంది. చిరంజీవి ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్ చేశారనేది తెలియాల్సిన విషయం.