Asianet News TeluguAsianet News Telugu

జనసేన ఓటమిపై మెగాస్టార్ కామెంట్.. పవన్ కి ఆ సత్తా ఉంది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోంది. రాంచరణ్ 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. 

Chiranjeevi Comments on Pawan Kalyan's Janasena Party
Author
Hyderabad, First Published Aug 18, 2019, 4:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోంది. రాంచరణ్ 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. 

ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోతో సైరా ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రమోషన్స్ కోసం స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగారు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓటమి గురించి ప్రశ్న ఎదురవగా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

రాజకీయాలనేవి సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, ఓటములు ఎదురవుతాయి. జనసేన పార్టీని విజయపథంలో నడిపించే సత్తా పవన్ కళ్యాణ్ కు ఉంది అని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. 

తనకు బిజెపి నుంచి ఆహ్వానం అందుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై కూడా చిరు స్పందించారు. నేను ఆ పార్టీలో చేరాలనేది వాళ్ళ కోరిక. దీనిపై నేనెలా స్పందించగలను. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే అని చిరంజీవి తెలిపారు. 

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. 2009 ఎన్నికల్లో 18 సీట్లు సాధించారు. ఆ తర్వాత 2011లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios