మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసనని కూతుర్లతో సమానంగా చూసుకుంటాడు. ఉపాసనకి కూడా తన మావయ్య అంటే అమితమైన ప్రేమ. చిరంజీవికి ఎంతో గౌరవం ఇస్తుంది. తాజాగా జరిగిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ఫ్యామిలీమొత్తం హాజరైంది.

అందులో ఉపాసన కూడా ఉంది. ఈ ఈవెంట్ కోసం ఉపాసన ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన గౌనును ధరించింది. అయితే ఈవెంట్ మొదలవ్వడానికి ముందు ఉపాసన తన మావయ్య చేత ఫోటోలు తీయించుకున్నారు. ఈ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

''సైరా నరసింహారెడ్డి ఈవెంట్ కి ముందు నా స్వీటెస్ట్ మావయ్య నా ఫోటోలు తీశారు. నేను వేసుకున్న బట్టలు ఆయనకి ఎంతో నచ్చాయి. అందుకే ఆయన ఫోటోలు తీశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఫోటోలు తీస్తున్నప్పుడు ఆయన రిఫ్లెక్షన్ కూడా మీరు చూడొచ్చు. ఆదివారం నాడు ఇంటర్నేషనల్ డాటర్స్ డే తో పాటు సైరా వేడుక కూడా జరిగింది. ఇంతకంటే అధ్బుతంగా సెలబ్రేట్ చేసుకోలేను''అంటూ రాసుకొచ్చింది.

ఇక ఉపాసన అపోలో హాస్పిటల్స్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంతో పాటు బీపాజిటివ్ అనే మ్యాగజైన్ ని కూడా నడుపుతున్నారు. ఈ మ్యాగజైన్ కోసం సెలబ్రిటీల  ఇంటర్వ్యూలు చేసి వారి ఫిట్నెస్ విషయాలను మ్యాగజైన్ లో పబ్లిష్ చేస్తుంటారు.