విక్టరీ స్టార్.. సీనియర్ హీరో వెంకటేష్ గురించి ఇంట్రెస్టింగ్  ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. వేరీజ్ ద పార్టీ అంటూ సరదాగా ఆటపట్టించారు.  

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రము ఏలిన నలుగురు హీరోలు పోటా పోటీగా సినిమాలు చేశారు. ఈ క్రమంలో సీనియర్ స్టార్స్ గా ఇప్పటికీ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో సినిమాల పరంగా వారి మధ్య పోటీ ఉన్నా...పర్సనల్ గా మాత్రం మంచి స్నేహం ఉంటుంది స్టార్ హీరోల మధ్య. పార్టీలు , ఫంక్షన్స్ లో సందడి చేస్తుంటారు కూడా. 

ఈక్రమంలో హీరో వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. చాలా సరదాగా ఆటపట్టిస్తున్నట్టుగా విష్ చేశారు చిరు. మై డియర్‌ వెంకీ.. పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి పార్టీ ఎక్కడా! అంటూ వెంకటేష్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతో పాటు టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు వెంకటేష్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. 

Scroll to load tweet…

ఈ ఏడాదితో 62 ఏళ్లు పూర్తి చేసుకున్నారు విక్టరీ వెంకటేష్.. ఈ ఏజ్ లో కూడా మంచి మంచి కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు వెంకటేష్. రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాలో నటించి మెప్పించిన వెంకటేష్‌ ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ఖాన్‌ కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనితో పాటుగా రానాతో కలిసి నటించిన రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ కు రెడీగా ఉంది. కాగా మంగళవారం వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చిరు కూడా తన స్టైల్లో వెంకటేష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు.