తండ్రిగా గర్విస్తున్నాను.. చరణ్ పుట్టిన రోజున చిరు ఎమోషనల్ పోస్ట్.. ఒక్క ఫొటోతో ఎన్నో మాటలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తండ్రిగా గర్విస్తున్నట్టుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మెగా ఫ్యామిలీ ఇంట వరుసగా శుభాలే జరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషానిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. గతేడాదే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని ప్రకటించడం.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ దక్కడం.. ఈక్రమంలో చరణ్ కు గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కడం వంటి ఎన్నో అంశాలను మెగా అభిమానుల ఆనందానికి కారణమయ్యాయి. ఈ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కూడా రావడం పండగ వాతావరణాన్ని తెచ్చింది.
మార్చి 27, 1985 చెన్నైలో జన్మించారు. ఈ ఏడాదితో 38వ ఏటా చరణ్ అడుగుపెట్టారు. ఈసారి చెర్రీ జన్మదిన వేడుకులను అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా స్టార్ చిరంజీవి కొడుకు చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్వీటర్ వేదికన విషెస్ తెలుపుతూ.. ‘నాన్న రామ్ చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నాను.. నీకు జన్మదిన శుభాకాంక్షలు‘ అంటూ తన బెస్ట్ విషెస్ ను అందించారు.
ఈ సందర్భంగా చరణ్ కు ప్రేమతో ముద్దుపెడుతున్న ఓ ఫొటోను కూడా పంచుకున్నారు. చరణ్ పై చిరంజీవి చూపిస్తున్న ఆప్యాయత, తండ్రి ప్రేమకు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చరణ్ చిన్నప్పటి ఫొటోను పంచుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక నాగబాబు నిన్ననిర్వహించిన చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈవెంట్ లో తన ప్రసంగంతో చెర్రీని ఆకాశానికి ఎత్తిన విషయం తెలిసిందే.
గ్లోబల్ స్టార్ గా కీర్తి పొందుతున్న రామ్ చరణ్ కు ఇటు ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ RC15 నుంచి బిగ్ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ పైనా ఇవాళే క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ‘ఆరెంజ్’ రీరిలీజ్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.