ఇటీవల మెగాస్టార్ బర్త్‌ డే సందర్భంగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా రకరకాలుగా చిరంజీవి మీద తమ ప్రేమను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో సుధాకర్‌ కోమాకుల (లైఫ్‌ ఈజ్‌ బ్యూటీ ఫేం) ఓ కవర్‌ సాంగ్‌ను రూపొందించాడు. ఛాలెంజ్‌ సినిమాలోని ఇందు వదన కుందరదన పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను రిలీజ్ చేశాడు సుధాకర్‌. ఈ పాటలో సుధాకర్‌తో పాటు ఆయన భార్య హారిక కూడా డ్యాన్స్ చేయటం విశేషం.

ఈ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో చిరంజీవి దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా సుధాకర్‌కు వాయిస్ మెసేజ్‌ను పంపించాడు. పాట అద్భుతం అంటూ పొగిడిన చిరు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న సుధాకర్ భార్య హారిక అంతా గ్రేస్‌తో స్టైల్‌గా డ్యాన్స్‌ చేయటాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సుధాకర్‌, హారికలను ప్రత్యక్ష్యంగా అభినందించే వీలు లేకపోవటంతో వాయిస్ మేసెజ్‌ రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు చిరు.
"