తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాకు ఆడియన్స్ నుండి తేడా వచ్చింది. అంతేకాదు ఊహకు అందని విధంగా ఓపినింగ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. 


మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన సినిమా అంటే ఆ ఓపినింగ్స్ వేరు..ఆ లెక్కలే వేరు. అప్పుడప్పుడూ కాస్త ఆ లెక్కలు కాస్త తప్పినా మళ్లీ వాల్తేరు వీరయ్యా లా పైకి లేస్తూ దుమ్ము రేపుతూంటారు. ఆ క్రమంలో వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించిన ఈ చిన్న నిన్న అంటే ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాకు ఆడియన్స్ నుండి తేడా వచ్చింది. అంతేకాదు ఊహకు అందని విధంగా ఓపినింగ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. ట్రైలర్, టీజర్ వర్కవుట్ కాకపోవటం, సినిమాకు బజ్ లేకపోవటంతో ఓపినింగ్స్ లేవు. దాంతోఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రైట్స్ 90 కోట్లుకు అమ్ముడయ్యాయి. రికవరీ మాత్రం 20%. భోళా శంకర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.30 కోట్ల గ్రాస్, రూ.15.48 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు సమాచారం. మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఏరియా షేర్

నైజాం ₹ 4.52 Cr
సీడెడ్ ₹ 1.85 Cr
ఉత్తరాంధ్ర ₹ 1.84 Cr 
గుంటూరు ₹ 2.07 Cr
ఈస్ట్ గోదావరి ₹ 1.6 Cr 
వెస్ట్ గోదావరి ₹ 1.85 Cr 
కృష్ణా ₹ 1.03 Cr
నెల్లూరు ₹ 0.72 Cr
ఆంధ్రా/ తెలంగాణా ₹ 15.48 Cr


సాధారణ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు అని అర్దమైపోయింది. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం కష్టమే అంటోంది ట్రేడ్ . ఇక మరోవైపు రజనీకాంత్ జైలర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. ఆ ఎఫెక్ట్ కూడా భోళా శంకర్ కలెక్షన్స్ పడనుంది