చిత్ర సీమలో వరుస విషాదాలు నెటకొంటున్నాయి. తాజాగా సీనియర్ నటుడు చలపతిరావు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ తారలు విచారం వ్యక్తం చేస్తూ.. సంతాపాలు తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ నటులు ఒక్కొక్కరిగా కాలం చెల్లుతుండటం సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు చలపతిరావు (Chalapathi Rao) (78) నిన్న రాత్రి ఎనిమిది గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చలపతిరావు మరణవార్తకు చలించిపోయారు. ఈ సందర్భంగా సంతాపం వ్యక్తం చేస్తూ.. ‘విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’ని తెలియజేశారు.

Scroll to load tweet…

నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రకటన విడుదల చేస్తూ.. ‘చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. చలపతిరావు గారు తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం వుంది. నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన’ని పేర్కొన్నారు.

చలపతిరావు మరణం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ‘ప్రముఖ నటులు శ్రీ చలపతిరావు గారు కన్నుమూయడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారు చలపతిరావు గారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. శ్రీ చలపతిరావు గారి కుమారుడు నటుడు, దర్శకుడు శ్రీ రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరమంటూ’ ప్రకటన విడుదల చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం చలపతిరావు మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’ అంటూ సంతాపం వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

చలపతిరావు మరణం పట్ల నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ‘చలపతిరావు బాబాయి అంటే నాకు ఒక వ్యక్తిగా, నా కుటుంబానికి కూడా చాలా ఇష్టం. అతని ఆకస్మిక మరణం మా కుటుంబం మొత్తాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నష్టాన్ని పదాలు వివరించలేవు. అతని కుటుంబానికి ఈ బాధను అధిగమించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

Scroll to load tweet…