మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’.  ఒక పాట మినహా షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈనెల 27న హైదరాబాద్‌లో విడుదల ప్రీ రిలీజ్ పంక్షన్ ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. 

ఇక  మొదట ఈ ఆడియో ఈవెంట్ కు తండ్రి మెగా స్టార్ చిరంజీవితో పాటు తారక్, ఎస్ఎస్ రాజమౌళిలను పిలవాలనేది రామ్ చరణ్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇప్పటికే చెర్రీ, ఎన్టీఆర్ లతో జక్కన్న భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్, దర్శకధీరుడు.. వివిఆర్ ఆడియో వేడుకకు వస్తే మూవీపై మంచి బజ్ క్రియేట్ చెయ్యోచ్చు అనుకున్నారు.  కానీ లాస్ట్ మినిట్ లో నిర్ణయం మార్చుకున్నారని, కేవలం చిరంజీవితో సరిపెడుతున్నారని తెలుస్తోంది.  తాము వస్తే అసలు విషయం డైవర్ట్ అవుతుందని తారక్, రాజమౌళి సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. 

నిర్మాత మాట్లాడుతూ ‘‘చరణ్‌, బోయపాటి కాంబినేషన్‌ అనగానే అంచనాలు పెరిగిపోయాయి. వాటిని తప్పకుండా అందుకుంటాం. టైటిల్‌, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. పాటలూ ఆకట్టుకుంటున్నాయి. మిగిలిన పాటని ప్రస్తుతం హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నాం. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము’’అన్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌   

పూర్తి స్దాయి యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ‘వినయ విధేయ రామ’లో  కైరా అడ్వాణీ హీరోయిన్. ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, ఆర్యన్‌ రాజేష్‌, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. డి.వి.వి దానయ్య నిర్మాత.  ఇక ‘వినయ విధేయరామ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే సంక్రాంతికి భారీగా రిలీజ్ కానుంది.