మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. `నారప్ప` చిత్రంపై, వెంకీ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఓ కొత్త వెంకటేష్‌ని చూస్తున్నట్టు చెప్పారు. ప్రతి సీన్‌లోనూ నారప్పే కనిపించాడన్నారు. 

వెంకటేష్‌ నటించిన `నారప్ప` చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలందుకుంటోంది. విజయవంతంగా రన్‌ అవుతుంది. దీనిపై సమంత సైతం ప్రశంసలు కురిపించారు. అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. `నారప్ప` చిత్రంపై, వెంకీ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఓ కొత్త వెంకటేష్‌ని చూస్తున్నట్టు చెప్పారు. ప్రతి సీన్‌లోనూ నారప్పే కనిపించాడన్నారు. 

చిరంజీవి ఈ మేరకు వెంకటేష్‌కి ఓ ఆడియోని పంపించారు. వెంకీకి ముందుగా అభినందనలు తెలిపిన చిరంజీవి. ఇప్పుడే నారప్పని చూశానని, ఇందులో వెంకీ నటన అద్భుతంగా ఉందన్నారు. వెంకీ పాత్ర కోసం తన బాడీని మలుచుకున్న తీరుని చిరు ప్రత్యేకంగా అభినందించారు. తనకు సినిమాలో ఎక్కడా వెంకటేష్‌ కనిపించలేదని, ప్రతీ సీన్‌లోనూ నారప్పే కనిపించడన్నారు. ఇందులో కొత్త వెంకటేష్‌ని చూస్తున్నానని చెప్పారు. పాత్రని ఎంతగానో అర్థం చేసుకుని డెప్త్ లోకి వెళ్లి నటించాడని తెలిపాడు. వెంకీలోని నటుడు ఎప్పుడు ఒక తపనతో, తాపత్రయంతో ఉంటాడనే దానికి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ. సంతృప్తినిచ్చిన సినిమా అని. ఇది వెంకీ కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుందన్నారు. 

మెగాస్టార్‌ పంచుకున్న ఆడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు వెంకటేష్‌. ఈ సందర్భంగా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మీరు ప్రశంసించిన ప్రతి పదం తనని ఎంతగానో ఆనందానికి గురి చేసిందన్నారు. `నారప్ప`పై మీ అభినందనలు వినయంగా స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్బంగా చిరుకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు వెంకటేష్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన ప్రియమణి నటించింది. ఇది తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `అసురన్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే.

Scroll to load tweet…