MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • విజయశాంతి ని లేడీ సూపర్ స్టార్ గా మార్చిన స్టార్ హీరో తండ్రి ఎవరో తెలుసా?

విజయశాంతి ని లేడీ సూపర్ స్టార్ గా మార్చిన స్టార్ హీరో తండ్రి ఎవరో తెలుసా?

తెలుగు సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ ఇమేజ్ పొందిన ఏకైక హీరోయిన్ విజయశాంతి. ఆమె సినీ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన విజయశాంతికి.. లేడీ సూపర్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 02 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
15 ఏళ్లకే హీరోయిన్ గా పరిచయం..
Image Credit : our own

15 ఏళ్లకే హీరోయిన్ గా పరిచయం..

విజయశాంతి చాలా చిన్నవయసులోనే వెండితెరపైకి వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే.. 1980లో తమిళ చిత్రం కల్లుక్కల్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమా నుంచే ఆమె, తన అందం, నటనతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తన నటనకు ప్రశంసలు పొందిన ఆమె, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె రికార్డు స్థాయిలో అవకాశాలు అందుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మెగాస్టార్ జోడీగా ఎక్కువ సినిమాలు..
Image Credit : stockPhoto

మెగాస్టార్ జోడీగా ఎక్కువ సినిమాలు..

సౌత్ లో తిరుగులేని ఇమేజ్ ను సాధించిన విజయశాంతి.. టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో మెరిసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఏకంగా 19 సినిమాలు చేసిన ఆమె.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాల్లో జంటగా నటించింది. వీరు కాకుండా.. వెంకటేష్, కృష్ణ, సుమన్, రాజశేఖర్ వంటి తెలుగు స్టార్ హీరోలతో సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది విజయశాంతి. చిరంజీవి డ్యాన్స్ కు పోటీ ఇచ్చిన హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు.

Related Articles

Related image1
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ : ఆస్తిలో ఎవరు అసలైన బాస్? ఎవరి సంపాదన ఎంతంటే?
Related image2
అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్, 100 వ సినిమా విషయంలో కింగ్ ఇలా చేశాడేంటి?
37
మాస్ పాత్రల్లో మెరిసిన విజయశాంతి..
Image Credit : our own

మాస్ పాత్రల్లో మెరిసిన విజయశాంతి..

హీరోయిన్ గా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఆమె లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ సినిమాల్లో కూడా నటించి విజయం సాధించింది విజయశాంతి. అంతే కాదు విమెన్ సెంట్రిక్ మూవీస్ హిట్ అవ్వవు అనే అపోహ ఉన్న రోజుల్లో.. స్టార్ హీరోల సినిమాలకంటే ఎక్కువ సక్సెస్ సాధించి.. ఎక్కువ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతిదే. అందుకే ఆమెను లేడీ అమితాబచ్చ, లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.

47
విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా మార్చింది ఎవరు?
Image Credit : @vijayashanthi_m

విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా మార్చింది ఎవరు?

1885 లో రిలీజ్ అయిన ప్రతిఘటన సినిమా విజయశాంతి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈసినిమాతోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రాణం పోశారు. ఈ సినిమాతో విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ ను చేశాడు దర్శకుడు టి. కృష్ణ. ఈ సినిమా కోసం ఆయన విజయశాంతినే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. 

కమర్షియల్ హీరోయిన్ గా బిజీగా ఉన్న విజయశాంతి.. డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోతే.. ఎన్నిరోజులైనా వెయిట్ చేస్తానని చెప్పారట కృష్ణ. ఈ సినిమా నువ్వే చేయాలమ్మ.. లేకపోతే అసలు ఈసినిమానే చేయను అని చెప్పారట కృష్ణ. అలా విజయశాంతితో ప్రతిఘటన సినిమా చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు. అంతే కాదు విజయశాంతి ఇమేజ్ ను కంప్లీట్ గా మార్చేశాడు.

57
విజయశాంతిని ఇమేజ్ మార్చిన గోపీచంద్ తండ్రి
Image Credit : our own

విజయశాంతిని ఇమేజ్ మార్చిన గోపీచంద్ తండ్రి

విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ రాడానికి కారణమైన దర్శకుడు కృష్ణ మరెవరో కాదు.. ప్రస్తుత టాలీవుడ్ హీరో గోపీచంద్ తండ్రి. టి. కృష్ణ వారసుడిగానే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ఈ విషయాన్ని రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ప్రస్తావించారు విజయశాంతి. ఇక ప్రతిఘటన తరువాత 1990లో విడుదలైన కర్తవ్యం సినిమా విజయశాంతి మూవీ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. 

ఇందులో ఆమె పోషించిన పాత్రకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో ఆమె పాత్రకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. కర్తవ్యం సినిమా తరువాతే విజయశాంతికి లేడీ అమితాబ్ అన్న పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆమె యాక్షన్ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.

67
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా
Image Credit : Asianet News

యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా

విజయ శాంతి యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆమె చేసిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకర్శించాయి.తన కెరీర్ లో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు విజయశాంతి. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా విజయశాంతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. 1989లో అనిల్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఈశ్వర్లో ఆమె లలిత పాత్రలో కనిపించారు. 

ఈ పాత్రకు కూడా ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.విజయశాంతి, సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె, 2000ల దశకంలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు.

77
విజయశాంతి రీ ఎంట్రీలో...
Image Credit : our own

విజయశాంతి రీ ఎంట్రీలో...

లాంగ్ గ్యాప్ తరువాత 2020లో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె కీలకమైన పాత్రను ఆమె పోషించారు. రీ ఎంట్రీలో చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు విజయశాంతి. వచ్చిన ప్రతీ అవకాశానికి ఒకే చెప్పకుండా సెలక్టీవ్ గా వెళ్తున్నారు. 

రీసెంట్ గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాతో మరోసారి ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ : ఆస్తిలో ఎవరు అసలైన బాస్? ఎవరి సంపాదన ఎంతంటే?
Recommended image2
అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్, 100 వ సినిమా విషయంలో కింగ్ ఇలా చేశాడేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved