మంచు కొండల్లో 'మిల్కీ బ్యూటీ' అంటూ మెగాస్టార్, తమన్నా ఆటా పాట.. యూట్యూబ్ షేక్ అయ్యేలా లిరికల్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ అయితే దక్కించుకోలేకపోయింది. పాటలు కూడా సో సో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీనితో భోళా శంకర్ నుంచి అదిరిపోయే కంటెంట్ కోసం ఫ్యాన్స్ వైట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కి హుషారు తెప్పించే విధంగా అదిరిపోయే సాంగ్ వచ్చేసింది. భోళా శంకర్ చిత్రం నుంచి తాజాగా మిల్కీ బ్యూటీ అనే పాట విడుదల చేశారు. లిరికల్ వీడియో రూపంలో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ ఒక మ్యాజిక్ లాగా ఉండనే చెప్పాలి. సాంగ్ మొత్తం ఒక బీట్ లో కొనసాగుతూ సంగీత ప్రియులని అలరించే విధంగా ఉంది. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ ఈ పాటకి అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి.
ఈ సాంగ్ లో మరో ఆకర్షించే అంశం చిరు తమన్నా కలసి వేస్తున్న హుక్ స్టెప్పులు. తమన్నా గ్లామర్ ఒలకబోస్తూ ఈజ్ తో ఈ సాంగ్ కి డ్యాన్స్ చేసింది. ఇక చిరు ఈ వయసులో కూడా కాళ్ళు మెలికలు తిప్పుతూ తనదైన శైలిలో డ్యాన్స్ అదరగొట్టేశారు. విజయ్ ప్రకాష్ తో పాటు మహతి స్వరసాగర్ భార్య సంజన ఈ పాటని పాడారు.
స్విట్జర్లాండ్ అందాల మంచు కొండల్లో డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సాంగ్ కి చిత్రీకరించారు. యూట్యూబ్ లో ఆల్రెడీ ఈ సాంగ్ వైరల్ కావడం ప్రారంభం అయింది. భోళా శంకర్ కి ఈ సాంగ్ ఫస్ట్ పాజిటివ్ బజ్ తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.