ఆగష్టు నెల టాలీవుడ్ కి మంచి సందడి తీసుకువచ్చింది. సీతారామం, కార్తికేయ 2, బింబిసార చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించాయి. ఇప్పటికి ఆ చిత్రాలు డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నాయి.
ఆగష్టు నెల టాలీవుడ్ కి మంచి సందడి తీసుకువచ్చింది. సీతారామం, కార్తికేయ 2, బింబిసార చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించాయి. ఇప్పటికి ఆ చిత్రాలు డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మంచి చిత్రాలని ప్రోత్సహించడంలో ముందుంటున్నారు. ఎట్టకేలకు చిరంజీవి 'సీతా రామం' చిత్రం వీక్షించారు.
ఏఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ లో తెలుపుతూ మూవీపై, చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. 'సీతా రామం' చిత్రం చూశాను. చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి కలిగింది. మనసులపై చెరగని ముద్రర వేసిన ఇలాంటి చిత్రాన్ని ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ లకు నా శుభాకాంక్షలు. ఏఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి ఒక ఫ్యాషన్ తో తెరకెక్కించారు. కలకాలం నిలిచిపోయే సంగీతాన్ని అందించారు విశాల్ చంద్రశేఖర్.
ఈ ప్రేమ కథకి ప్రాణం పోసిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లకు, సూత్రధారి పాత్రలో నటించిన రష్మిక మందనకి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం ఎన్నో అవార్డులు, రివార్డులు జాతీయ స్థాయిలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
తండ్రి సీతా రామం చిత్రంపై ప్రశంసలు కురిపిస్తే.. కొడుకు చరణ్ మరో చిత్రాన్ని అభినందించారు. కార్తికేయ 2 చిత్రానికి అభినందనలు తెలియజేస్తూ చరణ్ ట్వీట్ చేశాడు. మంచి సినిమాలు ఎప్పుడూ థియేటర్స్ కి వైభవాన్ని తీసుకువస్తాయి. మాసివ్ సక్సెస్ సాధించిన కార్తికేయ 2 చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ అంటూ రాంచరణ్ ట్వీట్ చేశారు.
