హైయెస్ట్ సక్సెస్ రేట్ తో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ దగ్గుబాటి పుట్టినరోజు నేడు. 1960 డిసెంబర్ 13న జన్మించిన వెంకటేష్ నేడు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అన్ని వర్గాలు మెచ్చిన విక్టరీ వెంకటేష్, దశాబ్దాల పాటు స్టార్ హీరోగా ఉన్నారు. వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకొని అభిమానులు, చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి తన సహనటుడు వెంకటేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
'ప్రియమైన వెంకటేష్... ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటూ లోతైన అవగాహనా, ఆధ్యాత్మికత కలిగిన నీతత్త్వం నన్ను సంతోష పరుస్తుంది. నీవు నటించిన నారప్ప చాలా ప్రభావవంతగా ఉంది. మీ భవిష్యత్తు బాగుండాలి, నారప్ప రూపంలో మంచి సక్సెస్ అందాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ బర్త్ డే' అని  ట్వీట్ చేశారు. అలాగే చిరంజీవి వెంకీ కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేశాడు చిరంజీవి. 
 
అలాగే మరో స్టార్ హీరో మహేష్ వెంకటేష్ కి బర్త్ డే విషెష్ తెలియజేశారు. సూపర్ కూల్ వెంకటేష్ గారికి బర్త్ డే విషెష్, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరో వైపు వెంకటేష్ ఎఫ్ 3 పై ప్రకటన విడుదల చేశారు.  దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్నా ఎఫ్ 3 కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించనున్నారు.