నాగార్జున హీరోగా నటించిన చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దియా మీర్జా, సయామీ ఖేర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా, వైల్డ్ డాగ్‌గా నాగార్జున నటిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. చిరంజీవి, మహేష్‌బాబు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ, `ఫెరోషియస్‌, పేట్రియాటిక్‌ స్టోరీ, డేర్‌ డెవిల్‌ టీమ్‌. నా సోదరుడు నాగ్‌ ఎప్పటిలాగే కూల్‌, అండ్‌ ఎనర్జిటిక్‌. ఆయన ఎలాంటి భయం లేకుండా అన్ని రకాల జోనర్లు ప్రయత్నించిన నటుడు. ఈ చిత్ర బందానికి, నిర్మాత నిరంజన్‌రెడ్డికి గుడ్‌ లక్‌` అన్నారు.

మహేష్‌ స్పందిస్తూ, `ఇంటెన్స్ యాక్షన్‌ ప్యాక్డ్ చిత్రం. ఇలాంటి స్టోరీని చెప్పాల్సిన అవసరం ఉంది. నాగార్జునగారు కూల్‌గా బెస్ట్ ఇచ్చారు. టీమ్‌కి అభినందనలు` అని చెప్పారు. తాజాగా విడుదలైన ట్రై ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. నాగార్జున ఇందులో సెటిల్డ్ యాక్షన్‌ చూపించారు. ఆయన మాటల్లో కాకుండా చేతల్లో తన సత్తాని చాటారని అనిపిస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 2న సినిమా విడుదల కానుంది.