అయోధ్యలోని రామాలయంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలబ్రెటీలు రామభక్తిని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన అయోధ్య రాముడిపై చిరంజీవి, నటి ఖుష్బూ స్పందించారు.
అయోధ్య Ayodhya లోని రామాలయంలో రేపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంగా ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆలయాన్ని అన్ని రకాలుగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్య నగరం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామాలయం Ayodhya Ram Mandir ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా ఇటు సినీ తారలు కూడా సంతోషిస్తున్నారు. రాముడిపై తమ భక్తిని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చ
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ట్విటర్ వేదికన (ఎక్స్) స్పందించారు. ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘చరిత్ర సృష్టిస్తున్నాం. చరిత్రను ఆసక్తికరంగానూ, చిరస్థాయిలో నిలిచిపోయే అపరిమితమైన అనుభూతి ఇది. ఈ ఆహ్వానాన్ని అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడానికి ఒక దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఐదు వందల ఏళ్లకు పైగా భారతీయుల తరతరాల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది.
నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం లభించింది. ఈ అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సన్మానాలతో ఆహ్వానించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు కూడానూ. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.. జై శ్రీ రామ్!’ అని పేర్కొన్నారు.
ఇక నటి ఖుష్బూ సుందర్ Kushbu Sundar కూడా రామభక్తిని చాటుకున్నారు. రెండు వ్యాఖ్యాల రాముడి స్తోత్రాన్ని పఠించారు. అలాగే పలువురు ముఖ్యులను తనలాగే ఆ పంక్తులను పఠించాలని సూచించారు. ఈ మేరకు వీడియోను పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారు... ‘అయోధ్యలోని రామమందిరప్రాణప్రతిస్థాపన సందర్భంగా నేను శ్రీరాముడికి అంకితం చేయడంలో భాగంగా రెండు పంక్తులను పఠిస్తాను. శ్రీరాముని గురించి జరుపుకునే ఈ శుభ సమయంలో, నేను శ్రీరామ భక్తులను రెండు పంక్తులను పఠించి భక్తి & ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి చేయమని ఆహ్వానిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సీఆర్ కేశవన్, ఎంపీ సుమలత, యాక్ట్రెస్ సుహాసిని మణిరత్నం, మీనా, కీర్తి సురేష్ Keerthy Suresh, కళ్యాణి ప్రియదర్శన్ ను ట్యాగ్ చేస్తూ రామభక్తిని వ్యాప్తి చేయాలని కోరారు.
