ఎంతో సున్నితంగా ఉండే కీర్తిసురేష్ ఒక్కసారిగా హంతకురాలిగా మారిపోయింది. లేడీ కానిస్టేబుల్ జాబ్ చేసే ఆమె సీరియల్ కిల్లర్‌గా మారి ఏకంగా 24 హత్యలు చేయడం షాకిస్తుంది.
`మహానటి`తో సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది కీర్తిసురేష్. ఆ తర్వాత `పెంగ్విన్` వంటి థ్రిల్లర్ చిత్రాల్లో మెరిసింది. కమర్షియల్ చిత్రాలతోనూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మహేష్‌తో `సర్కారు వారి పాట`లో అందంగా డ్యూయెట్లు పాడుకుంటోంది. అలాంటి ఎంతో సున్నితమైన కీర్తిసురేష్ ఒక్కసారిగా హంతకురాలిగా మారిపోయింది. లేడీ కానిస్టేబుల్ జాబ్ చేసే ఆమె ఏకంగా సీరియల్ కిల్లర్‌గా మారి 24 హత్యలు చేసింది. మొత్తానికి దొరికిపోయి పోలీసులు విచారిస్తుండగా, ఆ పోలీస్‌ని కూడా చంపేస్తానంటూ బెదిరిస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ వెన్నులో వణుకుపుట్టిస్తుంది.
కీర్తిసురేష్‌ని ఇలా చూసి ఆమె అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా `చిన్ని` అనే చిత్రంలోని స్టోరీ కావడం విశేషం. కీర్తిసురేష్, సెల్వరాఘవన్ కలిసి నటించిన తమిళ చిత్రం `సాని కాయిదమ్`. తమిళంలో రూపొందిన ఈ సినిమాని తెలుగులో `చిన్ని`గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ చిత్రంగా విడుదల కాబోతుంది. మే 6న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా `చిన్ని` చిత్ర తెలుగు, తమిళ ట్రైలర్లు విడుదల చేశారు. ఇందులో కీర్తిసురేష్ సీరియల్ కిల్లర్‌గా కనిపించబోతుండటం విశేషం. కిల్లర్‌గా విశ్వరూపం చూపించింది.

`చిన్ని` ట్రైలర్‌లో కీర్తిసురేష్ సఖినేటిపల్లి గ్రామానికి చెందిన `చిన్ని`గా, సెల్వరాఘవన్ రంగయ్యగా నటిస్తున్నారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తే చిన్ని రంగయ్యతో కలిసి 24 హత్యలు చేసింది. తనని విసిగిస్తున్న పోలీస్‌ని కూడా చంపేస్తానని, దీంతో 25 హత్యలవుతాయని బెదిరించడం, ఆ తర్వాత వరుసగా హ్యతలు చేస్తున్నట్టుగా సాగే ఈ `చిన్ని` ట్రైలర్ ఆకట్టుకోవడంతోపాటు గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. మరి కానిస్టేబుల్‌గా పనిచేసే చిన్ని ఎందుకు సీరియల్ కిల్లర్‌గా మారిందనేది సస్పెన్స్ గా మారింది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన కీర్తిసురేష్ ఇలాంటి కిల్లర్ రోల్స్ చేయడం షాకిస్తుంది. ఈ చిత్రానికి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించారు.
