సోనియా@చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ట్రైలర్ విడుదల

పీఆర్ మూవీ మేకర్స్, జీఆర్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఎస్. కే.పిక్చర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. సంతోష్ నేలంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.

హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో లీజ్ రోల్ చేస్తున్న హీరోయిన్ సోనియా, హీరో పవన్, సురేష్ కొండేటి, నిర్మాతలు గట్టు వెంకన్న, పవన్ సోనీ, దర్శకుడు సంతోష్ నేలంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత గట్టు వెంకన్న మాట్లాడుతూ... నలభై ఏళ్లు ఎగ్జిబిటర్ గా అనుభవం ఉన్న తాను మంచి కథ చెప్పడంతో.. సోనియా ప్రోద్బలంతోనే ఈ సినిమా నిర్మించానని తెలిపారు. ఈ చిత్రంలో జబర్దస్త్ కామెడీ ఉంటుందని ఆయన అన్నారు. 

ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ... తన సినిమాలకు దగ్గరగా అనిపించినందుకే ఈ మూవీని టేకప్ చేనినట్లు తెలిపారు. ఈ మూవీ ఖచ్చితంగా జర్నీ, ప్రేమిస్తే లాంటి సినిమాల తరహాలో పక్కా హిట్ కొడుతుందని సురేష్ కొండేటి అన్నారు. ఈ సినిమా కథ నచ్చటం వల్లనే రిలీజ్ బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు.